శిథిలావస్థకు చేరిన బిల్డింగ్:ఉస్మానియా ఆసుపత్రి పాత భవనానికి తాళం
శిథిలావస్థకు చేరిన ఉస్మానియా ఆసుపత్రి పాత భవనానికి సోమవారం నాడు ఇంచార్జీ సూపరింటెండ్ పాండునాయక్ తాళం వేశారు.శిథిలావస్థకు చేరిన ఉస్మానియా ఆసుపత్రి పాత భవనాన్ని సీల్ చేయాలని డీఎంఈ రమేష్ రెడ్డిని ఈ నెల 22వ తేదీన ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్: శిథిలావస్థకు చేరిన ఉస్మానియా ఆసుపత్రి పాత భవనానికి సోమవారం నాడు ఇంచార్జీ సూపరింటెండ్ పాండునాయక్ తాళం వేశారు.శిథిలావస్థకు చేరిన ఉస్మానియా ఆసుపత్రి పాత భవనాన్ని సీల్ చేయాలని డీఎంఈ రమేష్ రెడ్డిని ఈ నెల 22వ తేదీన ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెల 14, 15 తేదీల్లో కురిసిన వర్షాలకు ఉస్మానియా ఆసుపత్రిలోకి వర్షపు నీరు పాత భవనంలోకి వచ్చింది. ఇప్పటికే శిథిలావస్థకు చేరుకొన్న ఆసుపత్రిలో వర్ఫం నీరు రావడంతో ఎప్పుడు కూలిపోతోందోనని వైద్యులు, రోగులు, వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు.
దీంతో పాత భవనంలో ఉన్న డిపార్టుమెంట్లన్నీ కూడ పక్కనే ఉన్న భవనంలోకి మార్చాలని కూడ డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే సోమవారం నాడు ఉస్మానియా ఆసుపత్రి పాత భవనానికి తాళం వేశారు. ఈ భవనంలో ఉన్న శాఖలను పక్కనే ఉన్న భవనంలోకి మార్చారు. రోగులను ఇప్పటికే పక్క భవనంలోకి మార్చిన విషయం తెలిసిందే.
also read:ఉస్మానియా పాత భవనం సీజ్, డిపార్ట్‌మెంట్లు కొత్త భవనంలోకి: డీఎంఈ రమేష్ రెడ్డి
ఉస్మానియా పాత భవనాన్ని కూల్చివేయాలని వైద్యులు ఆందోళన చేసిన నేపథ్యంలో ఈ భవనంలో కార్యక్రమాలు నిర్వహించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఈ భవనాన్ని సీల్ చేయాలని డీఎంఈ ఈ నెల 22న ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల్లో భాగంగానే ఇవాళ ఉస్మానియా పాత భవనాన్ని ఇంచార్జీ సూపరింటెండ్ పాండునాయక్ తాళం వేశారు.
మరో వైపు ఉస్మానియా ఆసుపత్రిలోకి వర్షం నీరు చేరడంపై ఆగష్టు 21వ తేదీలోపుగా నివేదిక ఇవ్వాలని హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.