Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభం... తొందరొద్దు, ఆలోచించాలంటున్న విపక్షాలు

తెలంగాణలో జూలై 1 నుంచి అన్ని కేటగిరీల విద్యాసంస్థలు ప్రారంభంకానున్నాయి. స్కూళ్లు , కాలేజీలు తెరుచుకోనుండటంతో విద్యార్ధుల హాజరు, ఆన్‌లైన్ నిబంధనలకు సంబంధించి విధివిధానాలు విడుదల చేయాలని విద్యాశాఖను కేబినెట్ ఆదేశించింది.

opposition parties reacts educational institutions reopen ksp
Author
hyderabad, First Published Jun 19, 2021, 5:28 PM IST

తెలంగాణలో జూలై 1 నుంచి అన్ని కేటగిరీల విద్యాసంస్థలు ప్రారంభంకానున్నాయి. స్కూళ్లు , కాలేజీలు తెరుచుకోనుండటంతో విద్యార్ధుల హాజరు, ఆన్‌లైన్ నిబంధనలకు సంబంధించి విధివిధానాలు విడుదల చేయాలని విద్యాశాఖను కేబినెట్ ఆదేశించింది. అయితే స్కూళ్ల పున: ప్రారంభంపై పునరాలోచనల చేయాలని కోరుతున్నాయి విపక్షాలు. స్కూళ్లు తెరిచేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనపడకుండా భరోసా ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. 

Also Read:తెలంగాణలో మళ్లీ బడిగంటలు: జూలై 1 నుంచి విద్యాసంస్థలు పున: ప్రారంభం, కేబినెట్ గ్రీన్ సిగ్నల్

అంతకుముందు తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పూర్తిగా నియంత్రణలోకి రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అన్ని రకాల ఆంక్షల్ని, నిబంధనల్ని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో కరోనా కేసులు, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గాయని కేబినెట్ అభిప్రాయపడింది. వైద్య ఆరోగ్య శాఖ నివేదికను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios