మహబూబ్‌నగర్‌లో క్యాటర్ పిల్లర్ ఆన్‌లైన్ యాప్ పేరుతో జనానికి కుచ్చుటోపి పెడుతున్నారు కేటుగాళ్లు. సీసీ కుంట, దేవరకద్ర, తవుకుంట్ల మండలాల్లో ఈ యాప్ ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి మోసపోయారు జనం
మహబూబ్‌నగర్‌లో ఆన్‌లైన్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా క్యాటర్ పిల్లర్ ఆన్‌లైన్ యాప్ పేరుతో జనానికి కుచ్చుటోపి పెడుతున్నారు కేటుగాళ్లు. మూడింతల లాభాలు అంటూ కోట్లలో డిపాజిట్లు చేయించుకుంది ఆన్‌లైన్ ముఠా. సీసీ కుంట, దేవరకద్ర, తవుకుంట్ల మండలాల్లో ఈ యాప్ ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి మోసపోయారు జనం. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు పెద్ద సంఖ్యలో పోలీసులను ఆశ్రయిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
