హైదరాబాద్ శివార్లలోని ఇబ్ర‌హీంప‌ట్నం మండల ప‌రిధిలో కాల్పులు కలకలం సృష్టించాయి. కర్ణంగూడ గ్రామ సమీపంలో ఇద్దరు రియల్టర్లపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు ఘటన స్థలంలోనే మృతిచెందగా.. మరో రియల్టర్ తీవ్ర గాయాలు అయ్యాయి.

హైదరాబాద్ శివార్లలోని ఇబ్ర‌హీంప‌ట్నం మండల ప‌రిధిలో కాల్పులు కలకలం సృష్టించాయి. కర్ణంగూడ గ్రామ సమీపంలో ఇద్దరు రియల్టర్లపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు ఘటన స్థలంలోనే మృతిచెందగా.. మరో రియల్టర్ తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వ్యక్తికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స జరుగుతుంది. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు చెబుతున్నారు. కాల్పుల్లో మృతిచెందిన వ్యక్తిని శ్రీనివాస్ రెడ్డిగా, గాయపడిన వ్యక్తిని రాఘ‌వేంద‌ర్ రెడ్డి గుర్తించారు. 

ఆస్పత్రికి తరలించే ముందు తమపై కాల్పులు జరిగినట్టుగా రాఘవేందర్ రెడ్డి అక్కడివారికి చెప్పారు. ఘటన స్థలంలో బాధితుల కారుపై కూడా రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. శ్రీనివాస్​ రెడ్డి అల్మాస్​ గూడకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. రాఘవేందర్​ రెడ్డి అంబర్​పేట్​కు చెందిన వ్యాపారిగా భావిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి, రాఘ‌వేంద‌ర్ రెడ్డి కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారిని సమాచారం. ఇద్దరు వ్యాపార భాగస్వామ్యులు. వారిని సెటిల్‌మెంట్ పిలిచిన ప్రత్యర్థులు కాల్పులు జరిపినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి.. మంగళవారం ఉదయాన్నే కర్ణంగూడ సమీపంలోని వారి స్థలానికి చేరుకన్నారు. అయితే కాల్పులు మరో రియల్టర్ మట్టారెడ్డి ఉన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలోని పటేల్‌గూడలో శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్​ రెడ్డి‌లు కొనుగోలు చేసిన భూమి విషయంలో మట్టారెడ్డితో విభేదాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి కొంతకాలంగా గొడవలు చోటుచేసుకున్నట్టుగా పోలీసులు విచారణలో తేలింది. ఈ క్రమంలోనే మృతుడి కుటుంబ సభ్యులు మట్టారెడ్డిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. 

రాఘవేందర్ రెడ్డికి ప్రస్తుతం బీఎన్ రెడ్డిలోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. రాఘవేందర్​ రెడ్డి ఛాతీ కింద బుల్లెట్ గాయాన్ని గుర్తించిన వైద్యులు.. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రాఘవేందర్‌ రెడ్డి కోలుకుంటే అతని నుంచి వివరాలు సేకరించాలని పోలీసులు చూస్తున్నారు. కాల్ డేటా ఆధారంగా పోలీస్ విచారణ కొనసాగుతోంది.