Asianet News TeluguAsianet News Telugu

లోన్ యాప్ కేసు.. నకిలీ లెటర్ తో రూ.కోటి కాజేశాడు..!

మరోవైపు ఓ సైబర్ నేరస్థుడు పోలీసులను ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాను డీఫ్రీజ్ చేయడం గమనార్హం. ఆ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.1.18 కోట్లను మరో ఎకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేశారు.

One More Twist in Loan App Case
Author
Hyderabad, First Published Jun 1, 2021, 7:27 AM IST

లోన్ యాప్స్..  ఆ మధ్యకాలంలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. పలువురు ప్రాణాలు పోవడానికి కూడా ఈ యాప్స్ కారణమయ్యాయి. కాగా.. ఈ లోన్ యాప్స్ వ్యవహారంలో తాజాగా.. సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది.

ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేశారు. మరోవైపు ఓ సైబర్ నేరస్థుడు పోలీసులను ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాను డీఫ్రీజ్ చేయడం గమనార్హం. ఆ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.1.18 కోట్లను మరో ఎకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేశారు.

దీనిపై సోమవారం కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గతంలో అక్రమ వ్యవహారాలకు పాల్పడ్డ 32 కంపెనీలకు చెందిన బ్యాంకు ఖాతాలను గుర్తించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రూ.400 కోట్లకుపైగా ఫ్రీజ్‌ చేశారు. ఈ ఖాతాల్లో కోల్‌కతాలోని ఐల్‌పోరే ప్రాంతంలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకులోది కూడా ఉంది. ఈ ఖాతాను పోలీసులు గత ఏడాది డిసెంబర్‌లో స్తంభింపచేశారు.  అయితే ఇటీవల ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆ బ్యాంక్‌ మేనేజర్‌ను సంప్రదించి.. తాను ఎస్‌ఐగా పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు.

హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రాసినట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు. వీటిని ఆ మేనేజర్‌కు అందించి ఖాతాను డీ–ఫ్రీజ్‌ చేయించాడు. ఆపై గత నెల 13నరూ.1,18,70,779 స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆనంద్‌ జన్ను పేరుతో ఉన్న ఖాతాలోకి బదిలీ చేసి స్వాహా చేశాడు. గత నెల 20 మరికొంత మొత్తం ట్రాన్స్‌ఫర్‌ చేయించడానికి ప్రయత్నించాడు. దీనిని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు.దీంతో బ్యాంకు రీజనల్‌ మేనేజర్‌కు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన సోమవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios