జిల్లా కమిటీలోనూ సముచిత స్థానం కల్పించలేదన్న భావనతో ఆ పార్టీకి ఆయన దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో టీడీపీ ఉనికిని కోల్పోవడం, మారుతున్న రాజకీయ నేపథ్యంలో రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

తెలంగాణలో టీడీపీ తన పట్టు ఎప్పుడో కోల్పోయిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ.. పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్లు సమాచారం. ఆలోపే చంద్రబాబుకి గట్టి షాక్ తగిలింది. మరో సీనియర్ నేత పార్టీని వీడటానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

తెలుగుదేశం పార్టీకి కొంత కాలం నుంచి దూరంగా ఉంటున్న అంబర్‌పేట నియోజకవర్గం సీనియర్‌ నాయకుడు, విద్యానగర్‌ మాజీ కార్పొరేటర్‌ అడపా చంద్రమౌళి కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. 

గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వకపోవడంతోపాటు జిల్లా కమిటీలోనూ సముచిత స్థానం కల్పించలేదన్న భావనతో ఆ పార్టీకి ఆయన దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో టీడీపీ ఉనికిని కోల్పోవడం, మారుతున్న రాజకీయ నేపథ్యంలో రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

 ఇటీవల తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌ మాజీ ఎంపీ, అంబర్‌పేట నియోజకవర్గానికి పెద్దదిక్కైన వీహెచ్‌ను కలిసి చర్చలు జరిపినట్లు తెలిసింది. సముచిత స్థానం కల్పిస్తామని వీహెచ్‌ కూడా హామీనిచ్చారు. ఆ మేరకు చంద్రమౌళి తన అనుచరులతో సమావేశమై జన సమీకరణ, వాహనాల ర్యాలీ తదితర అంశాలను చర్చించినట్లు తెలిసింది. ఈ విషయంపై చంద్రమౌళిని ఆంధ్రజ్యోతి ప్రశ్నించగా, కాంగ్రెస్‌లో చేరికపై ఇంకా ఆలోచిస్తున్నట్లు చెప్పారు.