తెలంగాణలో ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా... తెలంగాణ ఇంటర్ బోర్డు వ్యవహారంతో ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా.. మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెనికి చెందిన మానస ఇటీవల ఇంటర్ పరీక్షలు రాసింది. మంచి మార్కులు వస్తాయని.. ఉన్నత చదువులకు వెళ్లాలని ఆమె భావించింది.
 
ఇంటర్ ఫలితాలు చూశాక ఫెయిల్ అని రావడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన కుటుంబీకులు మానసను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. అయితే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాలని డాక్టర్లు సూచించడంతో నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారు.

 ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మానస కన్నుమూసింది. మానస మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నా