హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌కి మరోకరు బలయ్యారు. మద్యం మత్తులో అత్యంత వేగంగా దూసుకొచ్చిన కారు బలంగా రోడ్డుపై వున్న డివైడర్‌ను ఢీకొట్టింది. హైటెక్ సిటీ కమాన్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో విశ్వతేజ అనే వ్యక్తి మృతి చెందాడు.

విశ్వతేజతో కలిసి స్నేహితులు ఇంద్రజిత్ వర్మ, సాయి వర్మలు మద్యం సేవించారు. అదే మత్తులో వేగంగా కారు నడిపి డివైడర్‌ను ఢీకొట్టిన విశ్వతేజ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మద్యం సేవించిన తర్వాత వాహనం నడిపేలా విశ్వతేజను ఇంద్రజిత్ వర్మ, సాయివర్మలు ప్రోత్సహించినట్లుగా గుర్తించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

కాగా, మద్యం తాగిన  వ్యక్తి వాహనం నడిపితే.. అది తెలిసి కూడా అందులో ప్రయాణించిన వారిపై కేసు నమోదు చేస్తామని సైబరాబాద్ పోలీసులు గతంలోనే తెలిపారు. నెల్లూరు జిల్లాకు చెందిన విశ్వతేజ కొన్నేళ్ల కిందట ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తున్నారు.