Asianet News TeluguAsianet News Telugu

డాక్టర్ భార్యకు బెదిరింపులు.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్

మంచి ఆదాయం ఉన్న డాక్టర్ల వివరాలు సేకరించి వారిని డబ్బు కోసం వేధించడం మొదలుపెట్టాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. 

one held ..who is used to send threatned messages and calls to doctor
Author
Hyderabad, First Published Oct 3, 2018, 11:52 AM IST

డాక్టర్ భార్యకు బెదిరింపు మెసేజ్ లు, కాల్స్ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ముషీరాబాద్ కి చెందిన ఓ డాక్టర్.. అదే ప్రాంతంలో కొన్ని సంవత్సరాలుగా క్లినిక్ ని నడుపుతున్నాడు. ఆయన తన భార్యతో కలిసి అదే ప్రాంతంలో నివసిస్తున్నారు.

కాగా.. కొద్ది రోజులుగా ఆయన భార్యకు ఒక నెంబర్ నుంచి బెదిరింపు కాల్స్, మెసేజ్ లు వస్తున్నాయి. రూ.కోటి ఇవ్వకుంటే కుటుంబసభ్యులందరినీ చంపేస్తామని అతను బెదిరిస్తున్నాడు. కాగా.. బాధిత డాక్టర్ ఇటీవల ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

చివరకు నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు మహ్మద్ అజహర్ గా గుర్తించారు. మలక్ పేటకు చెందిన ఇతను గతంలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేశాడు. ఆ సమయంలో.. చాలా మంది డాక్టర్ల పేరు, వివరాలు, ఫోన్ నెంబర్లు సేకరించాడు. అయితే.. గత  కొంతకాలంగా మహ్మద్.. ఆర్థిక సమస్యలతో సతమవుతున్నాడు. దీంతో తన వద్ద డాక్టర్ల జాబితాను పరిశీలించాడు. దాంట్లో  మంచి ఆదాయం ఉన్న డాక్టర్ల వివరాలు సేకరించి వారిని డబ్బు కోసం వేధించడం మొదలుపెట్టాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios