ములుగు: కాంగ్రెసు శాసనసభ్యురాలు సీతక్క వాహనం ఢీకొని ఓ చిన్నారి మరణించింది. మృతురాలు మూడేళ్ల చిన్నారి. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం జీడివాగు వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 

ప్రమాదం జరిగిన వెంటనే సీతక్క స్పందించారు. వాహనం దిగి అక్కడే ఉండి గాయపడినవారిని వేరే వాహనంలో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన చిన్నారి తల్లిదండ్రులను ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

సీతక్క కారు బైక్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. బైక్ దాదాపుగా నుజ్జు నుజ్జు అయింది. సీతక్క కారు ముందు భాగం ధ్వంసమైంది.