సికింద్రాబాద్‌లోని చిలకలగూడలో గ్యాస్ సిలిండర్ పేలింది. దూదిబావి బస్తీలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో.. ఒకరు మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారు. 

సికింద్రాబాద్‌లోని చిలకలగూడలో గ్యాస్ సిలిండర్ పేలింది. దూదిబావి బస్తీలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో.. ఒకరు మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. గ్యాస్ లీక్ కారణంగానే సిలిండర్ పేలినట్టుగా అనుమానిస్తున్నారు. 

ఈ ఘటనలో గాయపడినవారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఇక, గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి అక్కడి గోడలు కూడా దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించిందని స్థానికులు తెలిపారు. దీంతో తాము భయాందోళనకు గురైనట్టుగా చెప్పారు.