మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు అయ్యింది. గత కొంతకాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జరగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన దేశ రాజధాని ఢిల్లీ వెళ్లారు. అక్కడ బీజేపీ పెద్దలను కలిసి తాను పార్టీ మారే విషయంలో క్లారిటీ ఇవ్వనున్నారు.

ఆయనతోపాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. వారందరితో కలిసి కోమటిరెడ్డి.. ఢిల్లీ వెళ్లారు. ఈ నెల 28న ఆయన బీజేపీ పెద్దల సమక్షంలో కమలం తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా.. కోమటిరెడ్డి పార్టీ మారే విషయంలో కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు. అతను పార్టీ మారడానికి ముందే కాంగ్రెస్ నుంచి అతనిని బహిష్కరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.