Asianet News TeluguAsianet News Telugu

‘అదంతా నాటకం’... జర్నలిస్టు ఆత్మహత్యాయత్నం చుట్టూ రాజకీయం...

చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళా జర్నలిస్టు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం.. అందుకు కారణమైన వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన చుట్టూ రాజకీయ రంగు అలుముకుంది. వృద్ధుడిని పోలీసులు డబీర్పురా లో అరెస్టు చేసిన సమయంతో పాటు... పోలీస్ స్టేషన్ నుంచి జైలుకు తరలిస్తున్న సమయంలో భారీ సంఖ్యలో మజ్లిస్‌ కార్యకర్తలు వెంబడిస్తూ... అతనిపై దాడికి ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. 

oldcity woman journalist attempts suicide following activist s comments - bsb
Author
hyderabad, First Published Jun 15, 2021, 9:58 AM IST

చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళా జర్నలిస్టు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం.. అందుకు కారణమైన వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన చుట్టూ రాజకీయ రంగు అలుముకుంది. వృద్ధుడిని పోలీసులు డబీర్పురా లో అరెస్టు చేసిన సమయంతో పాటు... పోలీస్ స్టేషన్ నుంచి జైలుకు తరలిస్తున్న సమయంలో భారీ సంఖ్యలో మజ్లిస్‌ కార్యకర్తలు వెంబడిస్తూ... అతనిపై దాడికి ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. 

వివరాల్లోకి వెళితే డబీర్‌పురాకు చెందిన సయ్యద్ సలీం (66) గతంలో ఎంబీటీ, కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు. ఆయన తరచుగా మజ్లిస్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తుంటాడు.  ఇదిలా ఉండగా చాంద్రాయణగుట్టగుల్షన్‌ ఇక్బాల్‌ కాలనీలో నివాసం ఉండే యూట్యూబ్ న్యూస్ ఛానల్ ఎడిటర్ గా కొనసాగుతున్న సయ్యదా నహీదా ఖాద్రి (39) అనే మహిళా జర్నలిస్టుపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయసాగాడు.

ఈ విషయమై ఆమె గతనెల 25న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  దీనిపై కేసు నమోదైంది. అయినప్పటికీ సలీం తీరు మార్చుకోకుండా ఈ నెల 12న ఫేస్బుక్ లైవ్లో ఆమెపట్ల ఇష్టానుసారంగా వ్యాఖ్యానించారు.  అప్పటికే ఇరవై రోజుల నుంచి నిరాశ, నిస్పృహ తో ఉన్న ఆమె ఈ ఘటనతో మరింతగా మనస్తాపానికి గురైంది. ‘నెల రోజులుగా మానసిక క్షోభ అనుభవిస్తున్నానని.. పెళ్లి కావలసిన ఆడపిల్లలు ఉన్నారని.. నాకు ఆత్మహత్యే శరణ్యం’ అంటూ సెల్ఫీ వీడియో తీసి.. అనంతరం నిద్రమాత్రలు మింగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఒవైసీ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై ఆమె కుమార్తె సయ్యదా నబిహా ఖాద్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.

పాతబస్తీలో ఎంబీటీ నేత వేధింపులు: మహిళా జర్నలిస్ట్ ఆత్మహత్యాయత్నం..!...

సలీం ను అరెస్టు చేసేందుకు డబీర్‌పురాకు వెళ్ళిన పోలీసులను మజ్లిస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో అనుసరిస్తూ వెళ్లారు. అతడ్ని అదుపులోకి తీసుకున్న వెంటనే తీవ్ర పదజాలంతో దూషిస్తు.. దాడికి యత్నించారు.  అక్కడి నుంచి వచ్చాక ఆదివారం 9:30 గంటలకు కూడా చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి జైలుకు తీసుకెళ్తున్న సమయంలోనూ అదే విధంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.

అటు జర్నలిస్టు ఆత్మహత్యాయత్నం కూడా నాటకం అంటూ.. మజ్లిస్ పార్టీ పథకంలో భాగంగానే ఈ అరెస్ట్ కొనసాగిందని మజ్లిసేతర పార్టీలతో పాటు నెటిజన్లు పేర్కొంటున్నారు. సదరు జర్నలిస్టు సేవా కార్యక్రమాల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తుందని.. మజ్లిస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది అంటున్నారు.  లాక్‌డౌన్‌ సమయంలో మజ్లిస్‌ నేతలు, కార్యకర్తలు భారీగా పోగైనా పోలీసులు పట్టించుకోరా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు .

Follow Us:
Download App:
  • android
  • ios