వరంగల్: వరంగల్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. జూకంటి సమ్మయ్య అనే 85 ఏళ్ల వృద్ధుడిని గుర్తు తెలియని వ్యక్తి బుధవారం తెల్లవారు జామున హత్య చేశాడు. 

మరో సంఘటనలో అదే ప్రాంతంలో నివిస్తున్న 90 ఏళ్ల రాజమ్మ అనే వృద్ధురాలిపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరు గ్రామంలోని మాలవాడలో చోటు చేసుకుంది. 

ఇంటి బయట పడుకున్న సమ్మయ్యపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి గొంతు నులిమాడు. ఆ తర్వాత కత్తితో పలుమార్లు కడుపులో పొడిచాడు. సమ్మయ్య మర్మాంగాలను కూడా అతను కోసేశాడు. 

ఆ తర్వాత దుండగుడు ఇంటి పైకప్పు మీదుగా ఇంట్లోకి చొరబడి రాజమ్మపై దాడి చేశాడు.