హన్మకొండలో తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య సంఘటనను మరచిపోకముందే హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. ఏడేళ్ల చిన్నారిపై వృద్ధుడు అత్యాచారం చేయబోయాడు.

వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా బాలాజీనగర్‌కు చెందిన ఏడేళ్ల చిన్నారి ఇంటిబయట ఆడుకుంటున్న సమయంలో ఇంటిపక్కనే ఉన్న వృద్ధుడు చిన్నారిని భవనంపైకి తీసుకెళ్లాడు.

అనంతరం అత్యాచారయత్నం చేయగా.. పక్క భవనం నుంచి ఓ వ్యక్తి చూసి కేకలు వేశాడు. దీంతో చిన్నారిని వదిలేసిన వృద్ధుడు కిందకు దిగి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే అతనిని వెంటాడి పట్టుకున్న కుటుంబసభ్యులు, స్థానికులు కరెంట్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసి అనంతరం పోలీసులకు అప్పగించారు.