జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఓల్ మలక్‌పేట డివిజన్‌లో రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూకట్టారు. ఓల్డ్ మలక్ పేట్ డివిజన్‌లో మొత్తం 54,655 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. చివరి గంట సమయాన్ని కోవిడ్ పేషెంట్లు ఓటు వేసేందుకు కేటాయించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 30.26 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

అయితే బీజేపీ అభ్యర్ధితో పాటు ఆమె భర్త కూడా పోలింగ్ స్టేషన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ వాగ్వాదానికి దిగారు.