హైదరాబాద్: గతం కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాంపల్లి రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉన్న పురాతన భవనం కుప్పకూలిపోయింది. పురాతన కాలానికి చెందిన మొఘల్‌షరాఫ్‌ భవనం ఒక్కసారిగా నేలమట్టమైంది.  

పురాతన భవనం కావడంతోపాటు బీటలు వారడంతో ఆ ఇంటిని ఖాళీ చేశారు యజమానులు. అయితే పలువురు యాచకులు మాత్రం ఆ భవనం కింద తలదాచుకుంటున్నారు. 
అయితే ప్రమాద సమయంలో కొందరు యాచకులు భవనం శిథిలాల కింద చిక్కికున్నట్లు  తెలుస్తోంది. 

అయితే ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు పోలీసులు. మిగిలిన వారి పరిస్థితి బాగానే ఉందని పోలీసులు స్పష్టం చేశారు. ఇకపోతే హైదరాబాద్ లో ఇటీవలే ఒక భవనం కూడా కుప్పకూలిన సంగతి తెలిసిందే.