పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న వృద్ద దంపతులపై మారణాయుధాలతో దాడిచేసి అతి కిరాతకంగా హతమార్చాకు గుర్తుతెలియని దుండుగులు.
పెద్దపల్లి: ఇద్దరు కూతురు పెళ్లిళ్లయి అత్తవారింట్లో వుంటోంది. కొడుకు భార్యాపిల్లలతో హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు. దీంతో వృద్ద దంపతులిద్దరు ఒకరికొకరై ఇంతకాలం బ్రతికారు. కారణమేంటో తెలీదుగానీ గత ఇవాళ (బుధవారం) దంపతులిద్దరిని రక్తపుమడుగులో మృతిచెంది కనిపించారు. ఈ దారుణం పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
పెద్దపల్లి జిల్లా మంథని మండలం పుట్టపాక గ్రామ పంచాయతీ పరిధిలోని చల్లపల్లి గ్రామానికి చెందిన కొత్త లక్ష్మి, సాంబయ్య భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు సంతానం కాగా ముగ్గురికీ పెళ్లిల్లు అయ్యాయి. కొడుకు ఉపాధిరిత్యా భార్యా పిల్లలతో హైదరాబాద్ లో వుండటంతో ఇంటివద్ద వృద్దదంపతులిద్దరే వుండేవారు.
వీడియో
మంగళవారం రాత్రి దంపతులిద్దరు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియిన దుండగులు వారిపై మారణాయుధాలతో దాడి చేసారు. దీంతో భార్యాభర్తలు రక్తపుమడుగులో పడి అక్కడికక్కడే మృతిచెందారు. ఇవాళ ఉదయం వీరి మృతదేహాలను గుర్తించిన చుట్టుపక్కల ఇళ్లవారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మంథని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
సంఘటన స్థలాన్ని పెద్దపల్లి డిసిపి రవీందర్, గోదావరిఖని ఏసిపి గిరి ప్రసాద్ సందర్శించారు. హత్య జరిగిన విధానాన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని డిసిపి రవీందర్ తెలిపారు. పోలీస్ క్లూస్ టీం సహాయంతో ఆదారాలను సేకరించినట్లు డిసిపి తెలిపారు.
వద్ద దంపతుల దారుణ హత్యకు ఆస్తి వివాదమే కారణమా లేక ఇతర వ్యవహారాలేమైనా కారణమా అన్నకోణంలో పోలీసుల విచారణ సాగుతోంది. వృద్దదంపుతుల కొడుకు, కూతుళ్లకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే ఈ దారుణానికి పాల్పడిన నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
