ఖమ్మంలో పాత నోట్ల  కలకలం రేగింది. రద్దైన 500, 1000 నోట్ల రూపాయల నోట్ల డంప్ లభించింది. ఈ నోట్లు రద్దు చేసి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తుంది. అయినా ఈ నోట్లు ఇంకా అక్కడక్కడ కట్టలు కట్టలుగా బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా ఖమ్మంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

ఈ డంప్ కి సంబంధించిన వివరాలను పోలీసులు వివరించారు. పట్టుబడ్డ నోట్ల డంప్ ఇటీవల దొంగనోట్ల వ్యవహారం లో కీలకం గా వ్యవహరించిన సత్తుపల్లి మండలం గౌరీ గూడెం కు చెందిన మధార్ ముఠా కు చెందిన డంప్ గా గుర్తించారు.

తమ వద్ద సుమారు 100 కోట్ల రూపాయల విలువ గల పాత నోట్లు ఉన్నాయని పెద్ద డంప్ గా ఏర్పాటుచేసి నోట్ల కట్టల్లో పైనా కింద పాత 500,1000 నోట్లు మధ్యలో చిత్తుకాగితాలు పెట్టి  మధార్ ముఠా సభ్యులు మోసాలకు పాల్పడ్డారు.

మర్లపాడు గ్రామంలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తామని ఇంటిని అద్దెకు తీసుకుని  మధార్ ముఠా సభ్యులు.నకిలీ నోట్లు చలామణి చేస్తున్నారు.

పాత నోట్లు,దొంగ నోట్లు మార్పిడికి మధార్ కు సహాయ పడుతున్న గాయం వెంకటనారాయణ, చౌడవరం గ్రామం వేంసూరు మండల, కోట హనుమంతరావు గండుగులపల్లి గ్రామం దమ్మపేట మండలం కు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని  కల్లూరు ఎసిపి వెంకటేష్ తెలిపారు.