హైదరాబాద్.. ఉప్పల్ లో భారీ అగ్ని ప్రమాదం (వీడియో)

హైదరాబాద్.. ఉప్పల్ లో భారీ అగ్ని ప్రమాదం (వీడియో)

హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెట్రోలో ట్యాంకర్లో మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న సిలిండర్ల లారీకి వ్యాపించాయి. దీంతో గ్యాస్ సిలిండర్లు పేలి భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోల్ ట్యాంకర్ లో మంటలు, మరోవైపు సిలిండర్ల పేలుడుతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. సిలిండర్ల లారీలో ఉన్న చాలా గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఉప్పల్ సమీపంలోని చెంగిచర్ల చౌరస్తా వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడ్డారు. మరణించిన వారెవరైనా ఉన్నారా.. అన్నది ఇంకా తేలలేదు. నలుగురికి తీవ్ర గాయాలైనట్లు చెబుతున్నారు. గాయపడిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పెట్రోల్ కంపెనీ నుంచి ట్యాంకర్ బయటకు వచ్చిన తర్వాత మంటలు మొదలైనట్లు చెబుతున్నారు. పెట్రోల్ దొంగిలించే ప్రయత్నంలో పక్కనే ఉన్న వెల్డింగ్ షాపులో నుంచి నిప్పు రవ్వలు పెట్రోల్ ట్యాంకర్ మీద పడడంతో మంటలు మొదలైనట్లు చెబుతున్నారు. పెట్రోల్ మంట, గ్యాస్ మంట కలవడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలముకుంది. పేళుడు జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.  మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కింద వీడియో చూడొచ్చు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos