Asianet News TeluguAsianet News Telugu

సచివాలయం కూల్చివేతకు రంగం సిద్దం: కేసీఆర్‌కు అధికారుల నివేదిక

తెలంగాణ సచివాలయం కూల్చివేత విషయంలో సీఎం కేసీఆర్ రెండు రోజుల్లో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. సచివాలయం కూల్చివేతకు సానుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చిన  విషయం తెలిసిందే.

officers submits report to CM Kcr on telanagana secretariat building demolish
Author
Hyderabad, First Published Jul 1, 2020, 2:54 PM IST


హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేత విషయంలో సీఎం కేసీఆర్ రెండు రోజుల్లో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. సచివాలయం కూల్చివేతకు సానుకూలంగా హైకోర్టు తీర్పు ఈ ఏడాది జూన్ 29వ తేదీన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

తెలంగాణ సచివాలయం కూల్చివేత విషయమై అధికారులు సీఎంకు నివేదిక సమర్పించారు. సచివాలయంలో ఉన్న పాత వాహనాలను నిజాం కాలేజీ గ్రౌండ్స్ కు తరలించనున్నారు. 

ప్రస్తుత సచివాలయ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఐటీ సర్వర్స్ ను బూర్గుల రామకృష్ణారావు భవన్ కు తరలించారు. 

also read:గెలిచిన కేసీఆర్: సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

గత ఏడాది జూన్ 27వ తేదీన కొత్త సచివాలయ నిర్మాణ  పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై హైకోర్టులో కేసు ఉన్నందున నిర్మాణ పనులు నిలిచిపోయాయి.సచివాలయం కూల్చివేత పనుల విషయంలొ రెండు రోజుల్లో సీఎం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సచివాలయాన్ని నిర్మించనున్నారు. కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించి డిజైన్లను కూడ ప్రభుత్వం ఇప్పటికే సిద్దం చేసింది. 9 మాసాల్లో ఈ భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios