భక్తితో చేసుకోవాల్సిన జాతరను రక్తి మార్గంలో నడిపించారు. గంగమ్మ జాతరలో అశ్లీ నృత్యాలతో హోరెత్తించారు. అదేంటని అడిగితే.. ఇలాంటి నృత్యాలు ఆహ్లాదంగా ఉంటాయని సమర్థించుకున్నారు. చివరికి పోలీసుల రంగప్రవేశంతో...
నల్గొండ : అనంతగిరి మండలం లోని అమీనాబాద్ గ్రామంలో Gangamma Jataraలో అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. ప్రతి ఏడాది గ్రామంలో వైభవంగా నిర్వహించి గంగమ్మ జాతర సందర్భంగా సంగీత విభావరి పేరుతో ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు Obscene dances ప్రదర్శించారు. అనాధ ఆశ్రయం ఫ్లెక్సీలు ఉన్న వాహనంపై కళాకారులు అశ్లీల నృత్యాలు చేశారు. ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు సమాచారం.
అయితే సమాచారం అందుకున్న police గ్రామానికి చేరుకుని అశ్లీల నృత్యాలు ఆపి వేయించి జన సమూహాన్ని చెదరగొట్టారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జాతరలో అర్ధనగ్న ప్రదర్శన ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై సర్పంచ్ ముత్తినేని కోటేశ్వరరావును వివరణ కోరగా, సంగీత విభావరి స్థానిక ఎమ్మెల్యేనే ప్రారంభించారని.. ఇలాంటివి ఆహ్లాదకరంగా ఉంటాయి అని సర్పంచ్ కోటేశ్వరరావు సమర్థించుకున్నారు.
ఇదిలా ఉండగా, గతంలో వినాయక చవితి వేడుకల్లో మహిళలతో అశ్లీలంగా నృత్యాలు చేయించడం విజయవాడలో కలకలం రేపింది. నగర శివార్లలోని నున్నలో కొందరు యువకులు ఈ వికృత చర్యకు పాల్పడ్డారు. ఓ వినాయక మండపం వద్ద అర్ధరాత్రి నలుగురు మహిళలతో అశ్లీల నృత్యాలు చేయించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
నలుగురు మహిళలతో పాటు, ఈ ఘటనతో సంబంధం ఉన్న 8 మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై 290,294 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి నృత్య కార్యక్రమాలు విజయవాడలో ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారని పోలీసులు అసహనం వ్యక్తం చేశారు.
