హైదరాబాద్ నగరంలో పబ్ కల్చర్ పెరిగిపోతుంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని పబ్‌లు గలీజ్ దందాలకు తెరతీస్తున్నాయి. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. హైదరాబాద్ నగరంలోని కొన్ని పబ్‌ల తీరులో మార్పు రావడం లేదు. 

హైదరాబాద్ నగరంలో పబ్ కల్చర్ పెరిగిపోతుంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని పబ్‌లు గలీజ్ దందాలకు తెరతీస్తున్నాయి. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. హైదరాబాద్ నగరంలోని కొన్ని పబ్‌ల తీరులో మార్పు రావడం లేదు. తాజాగా కేపీహెచ్‌బీలో క్లబ్ మస్తీ పబ్.. మరోసారి గలీజు దందాకు అడ్డగా మారింది. గతంలో పోలీసులు దాడులు చేసిన.. ఈ పబ్ నిర్వాహకుల తీరు మారడం లేదు. పబ్ చాటున నిర్వాహకులు పెద్ద ఎత్తున అశ్లీల దందా నిర్వహిస్తున్నారు. యువతులతో రికార్డింగ్ డ్యాన్సులు, అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. 

అర్దరాత్రి 2 గంటల వరకు కూడా డీజే సౌండ్స్‌తో హోరెత్తిస్తున్నారు. యువతులతో డ్యాన్స్‌లు చేయిస్తూ డబ్బు దండుకుంటున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు గలీజ్ దందాకు పాల్పడుతున్నారు. అయితే పబ్ నిర్వాహకుల అశ్లీ దందాపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

ఇదిలా ఉంటే.. గత నెలలో మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు.. క్లబ్‌ మస్తీ పబ్‌లో తనిఖీలు నిర్వహించారు. పబ్‌లో యువతులతో అర్ధనగ్న నృత్యాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. సంబంధిత అధికారుల నుండి సరైన అనుమతి లేకుండా పబ్‌ను నిర్వహిస్తున్నారని, పబ్‌లో యువతులతో అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. ఆ సమయంలో పోలీసులు తొమ్మిది మంది మహిళా డ్యాన్సర్స్‌తో సహా 12 మందిని అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు.