ప్రతిష్టాత్మక 81వ నాంపల్లి ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (nampally industrial exhibition) రేపటి నుంచి ప్రారంభంకానుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డీసీపీ వెల్లడించారు. ప్రైవేట్ సెక్యూరిటీ , పోలీస్ సిబ్బంది అందుబాటులో వుంటారని ఆయన తెలిపారు. 

కాగా.. ప్రతి ఏటా నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించే ఎగ్జిబిషన్‌ (నూమాయిష్‌) (numaish 2022)ఈ సారి ఏర్పాటు చేస్తారో లేదోనని ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నెలన్నర రోజుల పాటు అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన కనువిందుగా సాగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ ముత్యాల నుండి మైసూర్ శాలువాల వరకూ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అయితే ఈ ఏడాది కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ (omicron) వ్యాప్తి నేపథ్యంలో ఎగ్జిబిషన్‌ నిర్వాహణ గందరగోళం నెలకొంది.

ఎగ్జిబిషన్‌ నిర్వాహణకు జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక శాఖ అనుమతులు ఇచ్చినా ఇంకా ప్రభుత్వం మాత్రం అనుమతులు ఇవ్వకపోవడంతో వర్తకులు, ప్రజలు నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్‌ నిర్వాహణపై హైకోర్టులో (telangana high court) ఇటీవల విచారణ సైతం జరిగింది. ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక సిబ్బంది అనుమతి ఇచ్చిందని సొసైటీ సభ్యులు కోర్టుకు తెలిపారు. కానీ.. ఎగ్జిబిషన్ నిర్వహణ పై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని అడ్వొకేట్‌ జనరల్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒమిక్రాన్ దృష్టిలో ఉంచుకుని తగు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశించింది.