హైదరాబాద్: కరోనా సమయంలో ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హెచ్ఆర్‌సీలో ఎన్ఎస్‌యూఐ ఫిర్యాదు చేసింది.

రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో ఎలాంటి పరీక్షలు నిర్వహించవద్దని  ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ కోరారు. ఈ మేరకు ఆయన ఇవాళ హెచ్ ఆర్ సీకి ఫిర్యాదు చేశారు.

స్కూల్స్, కాలేజీలు తెరవని కారణంగా ఆన్ లైన్ లో  ప్రైవేట్ విద్యాసంస్థలు పాఠాలను బోధిస్తున్నాయని ఆయన హెచ్ఆర్‌సీ దృష్టికి తీసుకెళ్లారు. ఆన్ లైన్ క్లాసులను కూడ నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

డిగ్రీ, పీజీ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ గతంలో ఎన్ఎస్ యూఏ హైకోర్టును  ఆశ్రయించింది. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తామని హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.జీవించే హక్కులను కూడ ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఎన్ఎస్ యూ ఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ విమర్శలు చేశారు.

also read:అబ్బాయిల కంటే అమ్మాయిలదే పైచేయి: సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల విడుదల

కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రవేశ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేసింది. టెన్త్ పరీక్షలను రద్దు చేసింది. ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను కూడ రద్దు చేసింది. అందరూ విద్యార్థులు పాసైనట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ రాష్ట్రంలో టెన్త్ పరీక్షలను రద్దు చేశారు. పలు ప్రవేశ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.