మీర్ పేటలో మంత్రి సబిత ఇంద్రారెడ్డి కాన్వాయ్ ను అడ్డుకున్న ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు శుక్రవారం నాడు అడ్డుకున్నారు. మంత్రి కాన్వాయ్ ను అడ్డుకున్న ఎన్ఎస్‌యూఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు  విష్ణువర్ధన్ రెడ్డి సహా పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు. 

హైదరాబాద్: TS TET_202 టెట్ ను వాయిదా వేయాాలని NSUI కార్యకర్తలు తెలంగాణ విద్యా శాఖ మంత్రి Sabitha Indra Reddy కాన్వాయ్ ను అడ్డుకున్నారు. ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Hyderabad లోని Meerpetపేటలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను మంత్రి సబితా ఇంద్రారెడ్డి వచ్చారు. అయితే టెట్-2022 పరీక్షలను వాయిదా వేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం సమర్పించేందుకు అంగీకరించకపోవడంతో మంత్రి కాన్వాయ్ ను ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు అడ్డుకున్నారు. 

తమకు సమయం కేటాయిస్తే మంత్రి కాన్వాయ్ ను తాము అడ్డుకొనేవారం కాదని ఎన్ఎస్‌యూఐ నేతలు చెబుతున్నారు. మీర్ పేట లో మంత్రి కాన్వాయ్ కు అడ్డుపడిన ఎన్ఎస్‌యూఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు Vishnuvardhan Reddy సహా ఎన్ఎస్‌యూఐ క్యాడర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. టెట్ పరీక్ష రోజునే ఆర్ఆర్‌బీ పరీక్ష ఉన్నందున టెట్ ను వాయిదా వేయాలని కోరుతున్నారు.

టెట్ న వాయిదా వేయాలని రేవంత్ ట్వీట్

Scroll to load tweet…

టెట్ పరీక్షను వాయిదా వేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా మంత్రిని కోరారు. టెట్ పరీక్షను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.