Asianet News TeluguAsianet News Telugu

వెకేషన్ కోసం గోవాకెందుకు .. మన హైదరాబాద్‌లోనే బీచ్ , అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఇద్దరు మిత్రులు

సాధారణంగా నలుగురు యువకులు కలిసి ఏదైనా వెకేషన్‌కి వెళ్లాలి అనుకుంటే ముందుగా గుర్తొచ్చేది గోవా గురించే. కానీ అంతదూరం వెళ్లకుండానే గోవా బీచ్ తరహా వాతావరణాన్ని పొందాలనుకుంటే . ఈ పరిస్థితుల్లో హైదరాబాదీలకు ఓ శుభవార్త. నగరంలోని శంకర్‌పల్లిలో తొలిసారిగా బీచ్ ఫార్మాట్‌లో వసతి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.

Now, feel the beach vibes of Goa at Hyderabad ksp
Author
First Published Jan 9, 2024, 3:21 PM IST

సాధారణంగా నలుగురు యువకులు కలిసి ఏదైనా వెకేషన్‌కి వెళ్లాలి అనుకుంటే ముందుగా గుర్తొచ్చేది గోవా గురించే. కానీ అంతదూరం వెళ్లకుండానే గోవా బీచ్ తరహా వాతావరణాన్ని పొందాలనుకుంటే . ఈ పరిస్థితుల్లో హైదరాబాదీలకు ఓ శుభవార్త. నగరంలోని శంకర్‌పల్లిలో తొలిసారిగా బీచ్ ఫార్మాట్‌లో వసతి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇస్లా అనేది గోవాలోని బీచ్ వైబ్‌లను హైదరాబాద్‌కు తీసుకొచ్చే గమ్యస్థానంగా మారింది. ఇదంతా మూస పద్ధతులను బద్ధలుకొట్టి.. హైదరాబాద్‌కు బీచ్‌ను అందుబాటులోకి తెచ్చింది. 

ఇస్లా ప్రయాణం ఇద్దరు మిత్రులు ఆకస్మిక బస కోసం ఒక స్థలాన్ని కనుగొనడానికి ప్రయత్నించినప్పుడు నిరాశకు గురయ్యారు. ఇతర ప్రదేశాలలో 20 రోజుల నిరీక్షణతో విసిగిపోయిన వారు వేగంగా వెకేషన్ ప్లాన్‌ డిసైడ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రజలు విహారయాత్రల కోసం తరచుగా గోవా గురించి ఎలా ఆలోచిస్తారనే దాని నుంచి ప్రేరణ పొందిన ఆ ఇద్దరు మిత్రులు బీచ్ వైబ్‌ను హైదరాబాద్‌కు తీసుకురావాలనుకున్నారు. గుడిసెలు, ఇసుక వంటి అంశాలను జోడించి గోవా లాంటి అనుభూతిని ఇవ్వాలనుకున్నారు. 

ఇక్కడ బస మాత్రమే కాదు.. ది ఇస్లాలో సూర్యుడు , ఇసుకతో అంతులేని సరదా ప్రపంచానికి మిమ్మల్ని దూరం చేసి లీనమయ్యే అనుభవం. ఇస్లా యజమాని సృజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో మాది బీచ్ నేపథ్య స్టేకేషన్. 4 బీహెచ్‌కే బసతో బీచ్ వైబ్, కాక్‌టెయిల్‌లను సిప్ చేయడానికి లే బ్యాక్ బార్ షాక్‌ను అందిస్తున్నామన్నారు. 360 డిగ్రీ పనోరమాలను అందించే గ్లాస్ రూమ్‌తో పాటు 4 బీహెచ్‌కే కంటైనర్‌ను అందిస్తున్నామని సృజన్ అన్నారు. ఇస్లా.. బీచ్ వాతావరణాన్ని ఔట్ డోర్ ఇన్ఫినిటీ పూల్, బేబీ పూల్స్, టికి షాక్ బార్, భోగి మంటల ప్రాంతం, యాంఫీ థియేటర్‌తో అలరిస్తుంది. 

ఇవి కాకుండా ఈ ప్రాంతంలో 10 వేల చదరపు అడుగుల గార్డెన్ వుందని.. ఈవెంట్‌లు, పార్టీలకు 250 మంది అతిథులకు వీలు కలిగిస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లోనే వుంటూనే బీచ్ వైబ్‌లను ఆస్వాదించడానికి ఇసుక, గుడిసెలు, బీచ్ బెడ్‌లతో కూడిన నిర్దేశిత శీతల ప్రాంతాన్ని ఇస్లా అందిస్తోంది. బీచ్ అనుభూతిని సృష్టించడానికి 140 టన్నుల ఇసుకను ఉపయోగించామని సృజన్ తెలిపారు.

పూల్ దగ్గర సన్ సెట్ సినిమా కోసం పెద్ద స్క్రీన్ కూడా వుందని పేర్కొన్నారు. ఇక ఇక్కడి టారీఫ్‌ల విషయానికి వస్తే.. సాధారణ రోజుల్లో రాత్రికి రూ.35000 వుండగా.. వీకెండ్‌లలో రూ.40 వేలు . అలాగే ఈవెంట్ ప్యాకేజీలు కూడా అందుబాటులో వున్నాయి. 100 మందికి రూ.70 వేలు, 150 మందికి రూ.80 వేలు, 200 కు మించిన గ్రూప్‌లకు రూ.90 వేలను ధరగా నిర్ణయించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios