సస్పెన్షన్ కు గురైన సీఐ నాగేశ్వరరావును కాపాడడం లేదు: రాచకొండ సీపీ మహేష్ భగవత్
సస్పెన్షన్ కు గురైన మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వర్ రావు ను కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ చెప్పారు.
హైదరాబాద్: సస్పెన్షన్ కు గురైన Marredpally CI నాగేశ్వరరావు ను కాపాడేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదని రాచకొండ సీపీ Mahesh Baghawat చెప్పారు. గురువారం నాడు మధ్యాహ్నం Hyderabad లో ఆయన మీడియాతో మాట్లాడారు. Nageswara Raoను కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని CP చెప్పారు. ఈ మేరకు కోర్టులో Custody పిటిషన్ ను కోర్టులో దాఖలు చేస్తామన్నారు. నాగేశ్వరరావు బాధితులు ఎవరైనా ఉంటే తమకు పిర్యాదు చేయాలని సీపీ కోరారు.
అత్యాచారానికి గురైన బాధితురాలికి రక్షణ కల్పిస్తామన్నారు.నాగేశ్వరరావు కేసులో సైంటిఫిక్ ఆధారాలను సేకరించినట్టుగా చెప్పారు. మెడికల్ పరీక్షలు కూడా పూర్తి చేసినట్టుగా సీపీ తెలిపారు. ఈ కేసులో సాక్షులను విచారిస్తున్నట్టుగా సీపీ తెలిపారు. ఈ కేసు విచారణ పూర్తి చేసి చార్జీషీట్ దాఖలు చేస్తామని సీపీ వివరించారు.
ఈ నెల 7వ తేదీన ఎల్ బీ నగర్ సమీపంలోని హస్తినాపురంలోని వివాహితపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నాగేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. తుపాకీతో బెదిరించి వివాహితపై అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధితురాలు ఆరోపించారు. . అదే సమయంలో ఇంటికి వచ్చిన తన భర్తను కూడా సీఐ బెదిరించాడని ఆమె ఆరోపించారు.. వీరిద్దరిని ఫామ్ హౌస్ కు తరలించే క్రమంలో రోడ్డు ప్రమాదం జరగడంతో తాము తప్పించుకున్నామని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ విషయమై సస్పెన్షన్ కు గురైన నాగేశ్వరరావుపై అత్యాచారం, కిడ్నాప్, ఆర్మ్స్ యాాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి.
నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను పోలీసులు పొందుపర్చారు. ఈ విషయాన్ని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ ఈ నెల 13న ప్రసారం చేసింది. బాధిత మహిళపై చాలాకాలంగా నాగేశ్వరరావు కన్నేసినట్టుగా రిమాండ్ రిపోర్టు తెలిపింది. బాధితులు పిర్యాదు చేయగానే నాగేశ్వరరావు బెంగుళూరుకు పారిపోయినట్టుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సర్వీస్ రివాల్వర్ ను పీఎస్‌లో డిపాజిట్ చేసినట్లు రిమాండ్ రిపోర్టు తెలిపింది.