Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ నుంచి ఇక అమెరికా వెళ్లడం సులువు.. డైరెక్ట్ విమానం

ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 777-200ఎల్ఆర్ విమానం మధ్యలో హాల్ట్ లేకుండా నేరుగా చికాగో వెళ్లొచ్చు. ఈ మేరకు గురువారం ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. 

Non stop Air India flight from Hyderabad to Chicago to start tomorrow
Author
Hyderabad, First Published Jan 15, 2021, 9:58 AM IST

ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లాలంటే.. కనెక్టింగ్ ఫ్లైట్ మధ్యలో మారాల్సి ఉండేది. కాగా.. ఇక నుంచి ఆ సమస్య లేదు. ఎందుకంటే.. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా అమెరికా వెళ్లడానికి విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. జాతీయ విమాన సంస్థ ఎయిరిండియా అమెరికాకు నేరుగా విమాన సర్వీసులు తీసుకువచ్చింది.

ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 777-200ఎల్ఆర్ విమానం మధ్యలో హాల్ట్ లేకుండా నేరుగా చికాగో వెళ్లొచ్చు. ఈ మేరకు గురువారం ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఈ రెండు నగరాల మధ్య డైరెక్ట్ విమానం కోసం చాలా కాలంగా డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిపెట్టుకుని తాజాగా ఈ సర్వీసును అందుబాటులోకి తెచ్చినట్టు ఎయిరిండియా అధికారులు పేర్కొన్నారు. 

ప్రతి బుధవారం చికాగో నుంచి రాత్రి 9.30 గంటలకు(అమెరికా కాలమానం ప్రకారం) ఏఐ-108 విమానం హైదరాబాద్‌కు బయల్దేరుతుంది. శుక్రవారం తెల్లవారుజామున 00.40 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. అలాగే రిటర్న్ ఫ్లైట్ ఏఐ-107 హైదరాబాద్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు చికాగో బయల్దేరుతుంది. వారానికి ఒకసారి మాత్రమే ఈ సర్వీసు ఉంటుంది. హైదరాబాద్ నుంచి చికాగో చేరుకునేందుకు 16 గంటల 45 నిమిషాలు పడితే.. చికాగో నుంచి హైదరాబాద్‌కు రావడానికి మొత్తం జర్నీ సమయం 15 గంటల 40 నిమిషాలు. ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ www.airindia.in లేదా టోల్ ఫ్రీ నెం. 1860 233 1407 కాల్ చేయొచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios