ఖమ్మం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బావ అనిల్ కుమార్ పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది. 2009 మార్చి 28వ తేదీన ఎన్నికల ప్రవర్తనా నియామవళి ఉల్లంఘించారనే ఆరోపణపై ఆయన మీద కేసు నమోదైంది.

ఖమ్మంలోని కరుణగిరి ప్రాంతంలో ఓ పార్టీకి ఓటు వేయాలంటూ అనిల్ కుమార్ కరపత్రాలు పంచారని ఆ కేసు నమోదైంది. ఈ కేసులో తొలి నిందితుడిగా ఉన్న అనిల్ కుమార్ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి వారంట్ జారీ చేశారు. 

అనిల్ కుమార్ ను కోర్టులో హాజరుపరచాలని ఖమ్మం రెండో అదనపు ప్రథమశ్రేణి కోర్టు న్యాయమూర్తి ఎం. జయమ్మ శుక్రవారం వారంట్ జారీ చేశారు.