Asianet News TeluguAsianet News Telugu

ఈ నెల 23 నుండి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్: కేసీఆర్

 వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 తేదీ నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇప్పటికే తన చేతుల మీదుగా ధరణి పోర్టల్  ప్రారంభం అయిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్ ను ప్రారంభిస్తారని  సిఎం తెలిపారు. 
 

non agriculture lands registration starts from november 23 says kcr lns
Author
Hyderabad, First Published Nov 15, 2020, 3:05 PM IST


హైదరాబాద్: వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 తేదీ నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇప్పటికే తన చేతుల మీదుగా ధరణి పోర్టల్  ప్రారంభం అయిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్ ను ప్రారంభిస్తారని  సిఎం తెలిపారు. 

ఆదివారం ప్రగతిభవన్ లో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం కెసిఆర్ ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడారు. ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియ ప్రజల ఆదరణ పొందుతుందన్నారు.

ధరణి పోర్టల్ పట్ల ప్రజల నుండి అద్భుతమైన ప్రతిస్పందన వస్తుందన్నారు.భూ రిజిష్ట్రేషన్ ప్రక్రియలో ఒక చారిత్రక శకం ఆరంభమైనట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారన్నారు. ధరణి ద్వారా  వారి వ్యవసాయ భూములకు భరోసా దొరికిందనే సంతృప్తిని నిశ్చింతను వ్యక్తం చేస్తున్నారన్నారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ అద్భుతంగా ఉందని సీఎం చెప్పారు.

 ధరణి పోర్టల్ చిన్న చిన్న సమస్యలను అధిగమించింది.  మరో మూడు నాలుగు రోజులలో  నూటికి నూరుశాతం అన్ని రకాల సమస్యలను అధిగమించనుందన్నారు.

ఎక్కడి సమస్యలు అక్కడ చక్కబడిన తర్వాతే  వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలనుకున్నామని ఆయన చెప్పారు. అందుకే కొన్ని రోజులు వేచి చూసినట్టుగా ఆయన తెలిపారు.

 నవంబర్ 23 సోమవారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియను లాంచ్ చేస్తారని సీఎం  తెలిపారు. ధరణి పోర్టల్ అద్భుతంగా తీర్చిదిద్దినందుకు  అధికారులను మనస్పూర్తిగా అభినందిస్తున్నారని ఆయన వివరించారు.

  ఈ  సమీక్షా సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్., సిఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు , రెవిన్యూ శాఖ కార్యదర్శి శేషాద్రి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు,  సిఎంవో అధికారులు, ఎంఏయుడీ డైరక్టర్ సత్యనారాయణ, పంచాయితీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios