జానారెడ్డికి నోముల బంపర్ ఆఫర్ ఇదే

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 9, Sep 2018, 3:32 PM IST
nomula narasimhaiah comments on janareddy
Highlights

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై ఫైరయ్యారు టీఆర్ఎస్ నేత నోముల నర్సింహయ్య. కేసీఆర్ రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తే టీఆర్ఎస్‌కు ప్రచారం చేస్తానని జానారెడ్డి గతంలో అన్నారని.. మరి ప్రచారం చేస్తారా అని నోముల సవాల్ విసిరారు

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై ఫైరయ్యారు టీఆర్ఎస్ నేత నోముల నర్సింహయ్య. కేసీఆర్ రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తే టీఆర్ఎస్‌కు ప్రచారం చేస్తానని జానారెడ్డి గతంలో అన్నారని.. మరి ప్రచారం చేస్తారా అని నోముల సవాల్ విసిరారు.

నాగార్జున సాగర్ నియోజకవర్గంలోనే రైతుబంధు కింద రూ.100 కోట్లు వచ్చాయని .. వాటిని పంపిణీ చేయడానికి జానారెడ్డి వస్తారా అని ప్రశ్నించారు. జానా మాకు ప్రచారం చేసినా.. మా కండువా కప్పుకున్నా నాకేం అభ్యంతరం లేదని.. ఆయన టీఆర్ఎస్‌లోకి వస్తానంటే నా టికెట్ త్యాగం చేస్తానని నోముల సవాల్ సవాల్ విసిరారు.

త్యాగాలకు టీఆర్ఎస్ ఎప్పుడూ సిద్ధమేనన్నారు.. ఎన్నికలంటే కాంగ్రెస్ వాళ్లు తోకముడుచుకుని పారిపోతున్నారని నర్సింహయ్య ఆరోపించారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కోటలు కూలడం ఖాయమని.. జానారెడ్డిని ఓడించేందుకు నాగార్జున సాగర్ ప్రజలు తహతహలాడుతున్నారన్నారు.. కాంగ్రెస్ అధికారంలో ఉంటే రైతుబంధు, రైతు భీమా పథకాలు వచ్చేవా..? అని ప్రశ్నించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పన్నెండు సీట్లు తామే గెలుస్తామన్నారు నోముల ధీమా వ్యక్తం చేశారు.

loader