నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు: మహిళా దర్బార్ లో గవర్నర్ తమిళిసై
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మహిళా దర్భార్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ఆపే శక్తి ఎవరికీ కూడా లేదన్నారు. సుమారు గంట పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 300 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హైదరాబాద్: తనను ఆపే శక్తి ఎవరికీ లేదని తెలంగాణ గవర్నర్ Tamilisai Soundararajan తేల్చి చెప్పారు.
శుక్రవారం నాడు Raj Bhavan లో మహిళా దర్భార్ ను Governor తమిళిసై నిర్వహించారు.మహిళలు తమ సమస్యలను చెప్పుకొనేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని రాజ్ భవన్ వర్గాలు ప్రకటించాయి.
సుమారు 300 మంది మహిళలు తమ సమస్యలు చెప్పుకొనేందుకు Mahila Darbar ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.సుమారు గంటకు పైగా ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు చెప్పుకున్న బాధలను గవర్నర్ విన్నారు. సీరియస్ కేసులకు సంబంధించిన బాధలను గవర్నర్ బాధితులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగించారు. రాజ్యాంగాన్ని గౌరవించాలని పరోక్షంగా కేసీఆర్ సర్కార్ కు ఆమె చురకలంటించారు. రాజ్ భవన్ ఎలాంటి హద్దులు దాటడం లేదని స్పష్టం చేశారు. రాజ్ భవన్ ను గౌరవించకుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఈ మధ్య జరుగుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నామన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. గ్యాంగ్ రేప్ ఘటనలో రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరినా ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. ప్రజల పక్షాన బలమైన శక్తిగా ఉంటానని ఆమె చెప్పారు. మహిళలు సమాజంలో బాధపడుతున్న సమయంలో వారిని ఆదుకొనేందుకు తాను ముందుంటాన్నారు.
రాష్ట్రంలో మహిళలు ఆనందంగా ఉండాలనేది తన తపన అని ఆమె చెప్పారు. తెలంగాణలోని మహిళలకు తాను తోడుగా ఉండాలని భావిస్తున్నట్టుగా ఆమె చెప్పారు. ప్రభుత్వానికి బాధిత మహిళలకు మధ్య తాను వారధిగా ఉంటానని కూడా గవర్నర్ హామీ ఇచ్చారు.
మహిళలు ఇబ్బంది పడితే తాను చూస్తూ ఉండలేనని కూడా ఆమె చెప్పారు. ఇబ్బందులు పడిన వారిని ఆదుకొనేందుకు తాను బలమైన శక్తిగా ఉంటానని తెలిపారు. తెలంగాణ మహిళలు, సంతోషంగా సురక్షితంగా ఉండాలని కోరుకుంటానని చెప్పారు. తెలంగాణ ప్రజల పక్షాన తాను పనిచేస్తానని చెప్పారు. విధానం ఏదైనా కావొచ్చు, ప్రతిదీ ప్రజల కోసమేననే విషయాన్ని ఆమె గుర్తు చేశారు.తనను విమర్శించిన వాళ్లను పట్టించుకోనని చెప్పారు.
గవర్నర్ ప్రజలను కలువగలరా అని కొందరు ప్రశ్నిస్తున్నారన్నారు. ఏ ప్రభుత్వ కార్యాలయం అయినా ప్రజల కోసమేనని చెప్పారు. కరోనా సమయంలో తనను చాలామంది ఆపినా తాను ఆగకుండా కొందరి కోవిడ్ రోగుల ను వెళ్లి పరామర్శించానని చెప్పారు..
also read:జూన్ 10న రాజ్ భవన్ లో మహిళా దర్బార్: తెలంగాణ గవర్నర్ తమిళి సై నిర్ణయం
ఒక్క మహిళగా తాను తన భావనను మహిళలకు తెలియజేయాలని ఆశిస్తున్నానని చెప్పారు. తెలంగాణ మహిళలకు నేను అండగా ఉండాలని అనుకుంటున్నానని చెప్పారు. తాను చేసే పనులకు ఎవరు అడ్డం చెప్పినా నేను పట్టించుకోనన్నారు.తెలంగాణ మహిళల కోసం నా పని కొనసాగుతూనే ఉంటుందన్నారు. నిరసనకారులను నేను పట్టించుకోనన్నారు.
మహిళలు ఇబ్బందులు పడితే నేను తట్టుకోలేను, నేను ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.సమస్యలు వస్తే మహిళలను ఆదుకోవాల్సిన భాద్యత ప్రభుత్వానిదని ఆమె గుర్తు చేశారు.ఏ పని చేసినా ప్రజల కోసమేనన్నారు. వినిపించని మహిళా గొంతుకలు వినిపించాలన్నారు. తాను ఉత్ప్రేరకం మాత్రమేనన్నారు.