Asianet News TeluguAsianet News Telugu

నోటీసులిచ్చినా కరాటే కళ్యాణి స్పందించలేదు: హైద్రాబాద్ కలెక్టర్


పిల్లల దత్తత విషయంలో సినీ నటి కరాటే కళ్యాణికి నోటీసులు జారీ చేశామని హైద్రాబాద్ కలెక్టర్ శర్మన్ చెప్పారు. ఈ నోటీసులకు కరాటే కళ్యాణి నుండి సమాధానం రాలేదన్నారు.

No Response From Cine Actor Karate Kalyani Says Hyderabad Collector Sharman
Author
Hyderabad, First Published May 16, 2022, 5:31 PM IST


హైదరాబాద్: సినీ నటి Karate Kalyani తీసుకున్న దత్తత విషయంలో నోటీసులు ఇచ్చినట్టుగా హైద్రాబాద్ కలెక్టర్ శర్మన్ తెలిపారు. అయితే కరాటే కళ్యాణి నుండి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు. సోమవారం నాడు Hyderabad  కలెక్టర్ Sharman మీడియాతో మాట్లాడారు. కరాటే కళ్యాణి నుండి ఎలాంటి సమాధానం రాలేదన్నారు.  ఇవాళ మరో నోటీసు ఇస్తామని కలెక్టర్ తెలిపారు. 

రేపటి వరకు ఈ నోటీసులపై  స్పందించకపోతే కరాటే కళ్యాణిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.. పిల్లలను దత్తత తీసుకోవాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయన్నారు. . దాని ప్రకారమే దత్తత తీసుకోవాల్సి ఉంటుందన్నారు. చట్టానికి విరుద్దంగా వెళ్తే మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

also read:ఏ తప్పు చేయలేదు.. చట్ట ప్రకారమే ఆ చిన్నారి దత్తత : చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సోదాలపై కరాటే కళ్యాణి తల్లి

సినీనటి కరాటే కళ్యాణి ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆదివారం నాడు  సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. ఆమె ఇంట్లో వుంటున్న చిన్నారి ఎవరన్న దానిపై ఆరా తీశారు. ఈ వ్యవహారంపై కరాటే కళ్యాణి తల్లి విజయలక్ష్మీ స్పందించారు. తాము ఏ తప్పు చేయలేదని చట్ట ప్రకారమే అమ్మాయిని దత్తత తీసుకున్నామని ఆమె తెలిపారు. 12 ఏళ్ల అబ్బాయిని కళ్యాణి పెంచుతోందన్నారు. ఇప్పుడు మరొక అమ్మాయిని పెంచుకుంటోందని విజయలక్ష్మీ తెలిపారు. డిసెంబర్ 25న పుట్టిన పాపను 28న ఇంటికి తీసుకొచ్చిందని అమ్మాయి పేరు మౌక్తిక అని ఆమె తెలిపారు. అబ్బాయిని శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చామని విజయలక్ష్మి చెప్పారు. 

రెండు రోజుల క్రితం తనపై దాడి చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేస్తే..ఇరువురిపై ఒకే రకమైన కేసులు పెట్టి నిందితునికి వంత పాడుతావా అంటూ సినీనటి కరాటే కళ్యాణి ఎస్‌ఆర్‌నగర్‌ సీఐ సైదులుపై  ఆగ్రహం వ్యక్తం చేసింది. 

విధుల్లో ఉన్న పోలీస్‌ అధికారులతో గొడవపడడం మంచిది కాదని స్టేషన్‌ నుంచి కళ్యాణిని  బయటకు పంపించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కళ్యాణి సీఐపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానన్నారు.

ఈ విషయమై వివరణ కోరగా సీఐ సైదులు చట్ట ప్రకారం సినీనటి కరాటే కళ్యాణి, యూట్యూబ్‌ ఫ్రాంక్‌ స్టార్‌ శ్రీకాంత్‌రెడ్డి ఫిర్యాదులను తీసుకుని ఇరువురిపై కేసులు నమోదు చేశామన్నారు.  కళ్యాణి మాత్రం తనను అన్యాయంగా కేసులో ఇరికించావని గొడవ పెట్టుకొందన్నారు. ఈ దాడికి కారకులు ఎవరనేది తేలగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సీఐ సైదులు వెల్లడించారు.

ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యూట్యూబ్ స్టార్ శ్రీకాంత్ రెడ్డిపై కరాటే కల్యాణి దాడి చేసింది. ప్రాంక్ వీడియోలు తీయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన కల్యాణి   శ్రీకాంత్ ఇంటికి వెళ్లి అతడిని నిలదీసింది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించింది. ఈ క్రమంలోనే అక్కడ గొడవ జరిగింది. తర్వాత శ్రీకాంత్ రెడ్డిపై కల్యాణి దాడి  చేసింది. ఈ క్రమంలోనే శ్రీకాంత్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 

మరోవైపు శ్రీకాంత్ తనపై కూడా దాడి చేసినట్టుగా కల్యాణి తెలిపింది. ఫ్రాంక్‌ పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ యువతను చెడుదోవ పట్టిస్తున్నాడని, దీనిపై ప్రశ్నించేందుకు వెళ్లిన తనతో పాటు నాలుగు నెలల చిన్నారిపై శ్రీకాంత్‌రెడ్డి దాడి చేశాడని కల్యాణి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరస్పరం ఫిర్యాదులు చేయడంతో ఇరువురిపై కేసులు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios