కేటీఆర్ సాక్షిగా, భౌతిక దూరం ఎలా తుంగలో తొక్కారో చూడండి(వీడియో)
నీరా కేఫ్ ఓపెనింగ్ సందర్భంగా కేటీఆర్ ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ భౌతిక దూరం అనే ఒక కాన్సెప్ట్ ఉన్నట్టుగా కూడా కనబడడం లేదు. కరోనా విలయతాండవం చేస్తున్నవేళ..... ఇలాంటి మీటింగుల వల్ల కరోనా వ్యాప్తి ఎక్కువ కమ్మంటే కాదా చెప్పండి..?
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ, భౌతిక దూరమొక్కటే మనకు శ్రీరామ రక్ష అని అందరూ చెబుతున్నారు. ప్రభుత్వం సైతం ఇదే విషయాన్నీ ప్రజలకు చెబుతున్నారు కూడా. ప్రభుత్వ పెద్దలు ఈ నియమాలను ఆచరిస్తూ అందరికి ఆదర్శంగా, స్ఫూర్తిప్రదాతహలుగా నిలవాలి.
కానీ నీరా కేఫ్ ఓపెనింగ్ సందర్భంగా కేటీఆర్ ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ భౌతిక దూరం అనే ఒక కాన్సెప్ట్ ఉన్నట్టుగా కూడా కనబడడం లేదు. కరోనా విలయతాండవం చేస్తున్నవేళ..... ఇలాంటి మీటింగుల వల్ల కరోనా వ్యాప్తి ఎక్కువ కమ్మంటే కాదా చెప్పండి..?
టెక్నాలజీని అధికంగా వినియోగించే మంత్రి కేటీఆర్ అన్ని ఆన్ లైన్ అనే తెరాస ప్రభుత్వం ఇంకా ప్రారంభోత్సవాల విషయంలో ఆన్ లైన్ కి మారలేదా అనే అనుమానం కలుగక మానదు. మంటైహ్రి శ్రీనివాస్ గౌడ్ సహా అనేక మంది పెద్దలే ఇలా నడుచుకుంటూ, అక్కడున్నవారిని కనీసం వారించకపోతుండడం నిజంగా శోచనీయం.
హైదరాబాద్ ఒక కరోనా హాట్ స్పాట్ గా మారుతున్న వేళ ఇలాంటి మీటింగులు దానికి మరింతగా దోహదం చేస్తున్నాయి. నానాటికి హైదేరాబద్ పరిధిలో కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండడంతో ప్రజలు బిక్కుబిక్కుమనుకుంటు కాలాన్ని వెళ్లదీస్తున్నారు.
ఇకపోతే.... తెలంగాణలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. తాజాగా బుధవారం కొత్తగా 1,554 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 49,259కి చేరింది.
నిన్న కరోనా కారణంగా తొమ్మిది మరణించడంతో మృతుల సంఖ్య 438కి చేరుకుంది. బుధవారం 1,281 మంది డిశ్చార్జ్ కావడంతో.. ఇప్పటి వరకు 37,666 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లయ్యింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,155 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఒక్క హైదరాబాద్‌లోనే 842 మందికి పాజిటివ్‌గా తేలింది.
ఆ తర్వాత రంగారెడ్డి 132, మేడ్చల్ 96, సంగారెడ్డి 24, కరీంనగర్ 73, నల్గొండ 51, వరంగల్ అర్బన్ 38, వరంగల్ రూరల్ 36, నిజామాబాద్ 28, మెదక్ 25, పెద్దపల్లి 23, సూర్యాపేట, కామారెడ్డిలో 22, సిరిసిల్ల 18, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ 14, మహబూబాబాద్ 11, యాదాద్రి, ములుగు, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎనిమిది చొప్పున కేసులు నమోదయ్యాయి.