Asianet News TeluguAsianet News Telugu

కరోనా నెగిటివ్ రిపోర్టు ఉంటేనే అసెంబ్లీకి అనుమతి: తెలంగాణ స్పీకర్ పోచారం

అసెంబ్లీకి హాజరయ్యే వారంతా తమకు కరోనా లేదని సర్టిఫికెట్ తీసుకురావాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

No permission without corona negative report into assembly says Telangana  Assembly speaker pocharam srinivas Reddy
Author
Hyderabad, First Published Sep 4, 2020, 5:13 PM IST

హైదరాబాద్: అసెంబ్లీకి హాజరయ్యే వారంతా తమకు కరోనా లేదని సర్టిఫికెట్ తీసుకురావాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

శుక్రవారం నాడు  స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు శుక్రవారం నాడు అసెంబ్లీలో అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై  చర్చించారు.

కరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా ప్రతినిదులకు మధ్య భౌతిక దూరం పాటించేలా సీటింగ్ సౌకర్యం కల్పించారు. భద్రతతో పాటు ఇతర అంశాలపై అధికారులతో చర్చించిన తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

అసెంబ్లీకి వచ్చే వారంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. ప్రతి రోజూ కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. కరోనా లేదని కరోనా నెగిటివ్ రిపోర్టును తీసుకొచ్చిన వారికి అసెంబ్లీలో అనుమతి ఉంటుందన్నారు. 

గత అసెంబ్లీ సమావేశాల సమయంలోనే కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన విషయాన్ని స్పీకర్ గుర్తు చేశారు. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఈ నెల 7వ తేదీ నుండి జరిగే  అసెంబ్లీ సమావేశాలకు మద్య చాలా తేడా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కరోనా పాజిటివ్ ఉంటే ప్రజా ప్రతినిధులను కూడ అసెంబ్లీలోకి అనుమతి ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 6వ తేదీలోపుగా కరోనా రిపోర్టును తీసుకొని రావాలని ఆయన కోరారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios