2023 అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీనే అధికారంలోకి వస్తుందని  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో పురపాలిక ఎన్నికలు దగ్గరపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పాల్గొన్న ఆయన సంచలన కామెంట్స్ చేశారు.

Also Read కేటీఆర్ ఆస్తులపై విచారణ.. రేవంత్ తప్పు చేశాడంటున్న వీహెచ్...

2023లో లక్షమంది ఓవైసీలు వచ్చినా బీజేపీ గెలుపుని ఆపలేరి అన్నారు.  సీఎం అభ్యర్థి ఎవరనేది జాతీయ నాయకత్వమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ‘నేనే సీఎం కావచ్చు’ లేదా సాధారణ కార్యకర్త అయినా కావచ్చంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే.. తాను సీఎం అభ్యర్థి అంటూ జరుగుతున్న ప్రచారం ఊహాజనితమేనని.. అందులో నిజం లేదని స్పష్టం చేశారు. అటు.. తెలంగాణలో అమలు చేస్తున్న అనేక పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తోందని అన్నారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను చేస్తారని వస్తున్న ఊహాగానాలపైనా ఆయన స్పందించారు. అలాంటి ప్రతిపాదనేదీ కేంద్రం వద్ద లేదని స్పష్టం చేశారు.

కల్వకుంట్ల, ఓవైసీ కుటుంబాల వల్ల తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని... ఆయన కుమారుడు మంత్రి అయ్యాడని.. ఆయన కుమార్తె ఎంపీ అయ్యారని అన్నారు. వాళ్లంతా పదవులు చేపడితే... ప్రజలు మాత్రం అవస్థలు పడ్డారని మండిపడ్డారు.