కాంగ్రెస్ వైఫల్యాలను చూడడానికి క‌ర్నాట‌క‌ వెళ్లాల్సిన అవసరం లేదు: కేటీఆర్

BRS working president KTR: కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, కర్నాట‌క‌ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు (కేటీఆర్) మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని తన ఎన్నికల ప్రచారంలో క‌ర్నాట‌కలో పర్యటించి చూడాలని ఆయన తెలంగాణ ప్రజలను కోరారు. అయితే, కాంగ్రెస్ వైఫల్యాలను చూడడానికి  క‌ర్నాట‌క‌ వెళ్లాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ కౌంట‌రిచ్చారు.
 

No need to go to Karnataka to see Congress government's failures: BRS working president KTR RMA

Hyderabad : కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, కర్నాట‌క‌ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు (కేటీఆర్) మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని తన ఎన్నికల ప్రచారంలో క‌ర్నాట‌కలో పర్యటించి చూడాలని ఆయన తెలంగాణ ప్రజలను కోరారు. అయితే, కాంగ్రెస్ వైఫల్యాలను చూడడానికి  క‌ర్నాట‌క‌ వెళ్లాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ కౌంట‌రిచ్చారు.

తమ రాష్ట్రంలో ఎన్నికల వాగ్దానాల అమలును సాక్షిగా చూడాలని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ఆహ్వానించ‌డంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పందిస్తూ.. తమ వైఫల్యాలను చూసేందుకు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. ‘‘మీ వైఫల్యాలను చూసేందుకు కర్నాటక వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ వల్ల (కర్నాటక ప్రభుత్వం) మోసపోయిన రైతులు ఇక్కడికి వచ్చి మీరు చేసిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. కాంగ్రెస్‌ వల్ల పొంచి ఉన్న ప్రమాదం గురించి రైతులు తెలంగాణ ప్రజలను ముందుగానే హెచ్చరిస్తున్నారు' అని ఆయన సందేశంలో పేర్కొన్నారు.

అలాగే, కాంగ్రెస్ కు అధికారం ఇస్తే.. అంధకారమే అని కర్ణాటక దుస్థితిని చూసి తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయిందన్నారు. "దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న తెలంగాణకు వచ్చి... క‌ర్నాట‌క‌లో 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం  సిగ్గుచేటు. అది మీ చేతకానితనానికి నిదర్శనం. మీ వైఫల్యాలను చూడటానికి కర్ణాటక వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ చేతిలో దగా పడ్డ అక్కడి రైతులే.. ఇక్కడికి వచ్చి మీరు చేసిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ నుంచి పొంచి ఉన్న ప్రమాదంపై హెచ్చరిస్తున్నారు. ఓవైపు కర్ణాటక ప్రజలు పుట్టెడు కష్టాలతో పడరాని పాట్లు పడుతుంటే పట్టించుకోకుండా తెలంగాణలో ఓట్ల వేటకొచ్చారా.. ?" అంటూ విమ‌ర్శించారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన మిమ్మల్ని కర్ణాటక ప్రజలు క్షమించరనీ, తెలంగాణ ప్రజలు విశ్వసించరని పేర్కొన్నారు. "ఎన్నికల ప్రచారంలో  ఐదు హామీలు అని అరచేతిలో వైకుంఠం చూపించారు. తీరా గద్దెనెక్కిన తరువాత సవాలక్ష కొర్రీలతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. మీ గృహజ్యోతి పథకం గాలిలో దీపంలా ఆరిపోయింది. ఎడాపెడా కరెంట్ కోతలు.. చార్జీల వాతలతో కర్ణాటక చీకటిరాజ్యంగా మారిపోయింది. కనీసం ఐదుగంటలు కూడా కరెంట్ లేక అక్కడి రైతాంగమే కాదు.. రాష్ట్ర రాజధాని బెంగుళూరులో ఎడాపెడా పవర్ కట్ లతో వాణిజ్య వ్యాపార సంస్థలు కూడా కష్టాల కడలి లో కొట్టుమిట్టాడుతున్నాయ‌ని" కాంగ్రెస్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

క‌ర్నాట‌క‌లో అధికారంలోకి రాగానే కమీషన్ల కుంభమేళాకు తెర తీసిన కాంగ్రెస్ అవినీతి బాగోతాన్ని చూసి తెలంగాణ సమాజం మండిపడుతోందని పేర్కొన్న కేటీఆర్.. క‌ర్నాట‌క‌లో సకల రంగాల్లో సంక్షోభానికి తెరతీసిన కాంగ్రెస్ ను నమ్మి మోసపోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరనీ, ఎందుకంటే.. ఇది తెలంగాణ గడ్డ.. చైతన్యానికి అడ్డ అని పేర్కొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios