సారాంశం
తెలంగాణ పాఠశాల వేసవి సెలవులు పొడిగిస్తారనే వదంతులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎండలు ఇంకా తీవ్రంగానే ఉండటంతో ఈ వదంతులపై చర్చ జరిగింది. కానీ, తెలంగాణ విద్యా శాఖ ఈ వదంతులకు చెక్ పెడుతూ స్పష్టత ఇచ్చింది. వేసవి సెలవుల పొడిగింపు లేదని పేర్కొంది.
హైదరాబాద్: ఎండలు ఇంకా మండుతూనే ఉన్నాయి. ఇంటి బయట అడుగు పెడితే మాడిపోయే పరిస్థితులు ఉన్నాయి. మే నెల ముగిసి జూన్ నెల రెండో వారం కూడా ముగిసే సమయానికి వస్తున్నా ఎండల్లో మాత్రం తగ్గుదల లేదు. ఎండకాలం తొలినాళ్లలో కురిసిన వర్షాలతో ఎండకాలం వాయిదా పడిందా? అన్నట్టుగా మారిపోయింది. ఇప్పటికీ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పాఠశాల ఎండా కాలం సెలవులు పొడిగిస్తారనే చర్చ ముందుకు వచ్చింది. సోషల్ మీడియాలోనూ స్కూల్స్ సెలవులు పొడిగిస్తారనే వదంతులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ విద్యా శాఖ స్పందించి క్లారిటీ ఇచ్చింది.
ఈ ఏడాది వేసి సెలవుల్ని పొడిగించే అవకాశం లేదని విద్యా శాఖ స్పష్టం చేసింది. వచ్చే సోమవారం అంటే జూన్ 12వ తేదీనే స్కూల్స్ యథావిధిగా ప్రారంభం అవుతాయని స్పష్టత ఇచ్చింది. దీంతో ఇది వరకు చక్కర్లు కొడుతున్న వదంతులకు ఫుల్ స్టాప్ పడినట్టయింది.
Also Read: Odisha Train Tragedy: మృతదేహాలు ఉంచిన స్కూల్ కూల్చేసిన అధికారులు.. ఎందుకంటే?
అయితే, త్వరలోనే రుతుపవనాలు మన రాష్ట్రాన్ని పలకరించనున్నాయి. వచ్చే వారం రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయనే అంచనాలు ఉన్నాయి. అంటే వచ్చే వారం నుంచి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు పడిపో తాయి. కాబట్టి, స్కూల్స్ వేసవి సెలవులు పొడిగించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఉండొచ్చని తెలుస్తున్నది. దీంతో సోమవారం నుంచి రాష్ట్రంలో స్కూల్స్ పున: ప్రారంభం కానున్నాయి.