ముందస్తు లేదు, నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే తెలంగాణలో ఎన్నికలు: తేల్చేసిన కేటీఆర్
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పారు.
హైదరాబాద్: Telangana రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని తెలంగాణ మంత్రి KTR ప్రకటించారు. ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు.
శుక్రవారం నాడు మంత్రి కేటీఆర్ హైద్రాబాద్ లో మీడియా ప్రతినిధులతో Chit Chat చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి 90 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. మొన్న విడుదల చేసిన సర్వే బీజేపీ, నిన్న విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీలకు చెందిందన్నారు.కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ సాధిస్తారు. దక్షిణాదిలో వరుసగా ఎవరూ సీఎంగా బాధ్యతలు చేపట్టలేదని ఆయన చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ సర్వేలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. కేసీఆర్ దొర అయితే ఎంతమందిని జైల్లో వేశారని ఆయన ప్రశ్నించారు. మంచి పనులతో ప్రజల మనసులు గెలవడం బీజేపీ చేతకాదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఎవరికీ లొంగరు, బెదరని కేటీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణపై కేంద్రం నియంతృత్వంగా వయవహరిస్తుందన్నారు.
ఈ రెండు సర్వేలు కూడా తెలంగాణలో టీఆర్ఎస్ విజయం సాధిస్తాయని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో బలాలు, బలహనీతల ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక చేస్తామన్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయమని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ లో చేరాలని తాము ఎవరిని బలవంతం చేయడం లేదన్నారు. పార్టీ నేతల మధ్య గొడవల విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా తమ పార్టీ బలాన్ని సూచిస్తుందని చెప్పారు. సిరిసిల్లకు రాహుల్ గాంధీ వస్తే స్వాగతిస్తామన్నారు.సిరిసిల్లకు వచ్చి రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను చూసి నేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలను కోరుతామన్నారు. తెలంగాణ గవర్నర్ తో తమకు ఎలాంటి పంచాయితీ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఆర్ఓఎఫ్ఆర్ చట్టం సవరిస్తే పోడుభూముల సమస్య పరిష్కారం కానుందన్నారు. ఈ చట్టం కేంద్రం పరిధిలో ఉందన్నారు.. కేంద్రానికి చిత్తశుద్ది ఉంటే పోడు భూముల చట్టాన్ని సవరణ చేయాలని కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. కేంద్రం ఈ చట్ట సవరణ చేస్తే వెంటనే గిరిజనులకు పట్టాలిస్తామన్నారు. కట్ ఆఫ్ డేట్ పెంచి ఆర్ఓఎఫ్ఆర్ చట్టాన్ని సవరణ చేస్తే పోడు భూముల సమస్యకు వెంటనే పరిష్కారం లభించనుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.గిరిజనుల హక్కులను కాలరాసేలా కేంద్రం చట్టాలను తెస్తుందన్నారు. ఈ యాక్టులను పార్లమెంట్ లో అడ్డుకొనే ప్రయత్నం చేస్తామన్నారు.
తన కంటే బాగా పనిచేసే మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో అర్హులకు రేషన్ కార్డులు,పెన్షన్ల విషయంలో సీఎం కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు.
శత్రు దేశాలపై ఆర్థిక ఆంక్షలు పెట్టినట్లు అప్పుల విషయంలో కేంద్రం వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. రైతులపై కేంద్రం కక్ష కట్టినట్లువ్యవహరిస్తోందన్నారు.కేంద్రానికి సిగ్గు, మనం ఉంటే తెలంగాణ తరహాలో ఉపాధిహామీ పనులను దేశం మొత్తంలో చేసేలా చూడాలని ఆయన కోరారు. హైదరాబాద్ లో వరదలు వస్తే కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు కానీ గుజరాత్ కు ఇప్పటికే వెయ్యి కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చారని ఆయన విమర్శించారు.
మన్మోహన్ సింగ్ ను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ స్వాగతం పలకలేదని కేటీఆర్ గుర్తు చేశారు.
మోదీ దేశానికి కాదు గుజరాత్ కు ప్రధానమంత్రి అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు.