ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పార్టీ మారాలని డబ్బులు, పదవులు ఆశ చూపినా తాను మాత్రం టీఆర్ఎస్‌లోనే కొనసాగానని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి చెప్పారు
హైదరాబాద్: ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పార్టీ మారాలని డబ్బులు, పదవులు ఆశ చూపినా తాను మాత్రం టీఆర్ఎస్‌లోనే కొనసాగానని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి చెప్పారు. తనకు జిల్లా నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న మరో మంత్రి జూపల్లి కృష్ణారావుకు మధ్య ఎలాంటి విబేధాలు లేవన్నారు.
డాక్టర్ లక్ష్మారెడ్డితో ఓ తెలుగు న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. రాజకీయాల్లోకి ఎలా వచ్చారు... రాజకీయాల్లో అవకాశాల కోసం ఎలా ఎదురుచూశాననే విషయాలపై ఆయన ఆ ఇంటర్వ్యూలో స్పందించారు.
కేసీఆర్ టీఆర్ఎస్‌ను ఏర్పాటు చేసిన తర్వాత తాను టీఆర్ఎస్‌లో చేరినట్టు లక్ష్మారెడ్డి చెప్పారు. 2004లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఒప్పందంలో భాగంగా జడ్చర్ల స్థానం నుండి తాను పోటీచేసి విజయం సాధించినట్టు చెప్పారు. 2008 ఎన్నికల్లో పార్టీ ఆదేశం మేరకు తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని ఆయన గుర్తు చేసుకొన్నారు.
వైఎస్‌రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో టీఆర్ఎస్‌ను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరాలని తనకు ఆహ్వానం వచ్చిందన్నారు. డబ్బులు, పదవులు ఆశ చూపినా కానీ తాను పార్టీ మారేందుకు మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని తనపై చాలా ఒత్తిడి వచ్చిన విషయాన్ని మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి గుర్తు చేసుకొన్నారు.
తిమ్మాజీపేట మండలంలోని ఆవంచ గ్రామానికి తొలిసారిగా తాను సర్పంచ్‌గా పోటీ చేసి విజయం సాధించినట్టు చెప్పారు. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాలో హోమియో కోర్సు పూర్తి చేసి హైద్రాబాద్ లో ఏడాదిపాటు హౌస్ సర్జన్‌గా పనిచేస్తున్న సమయంలోనే గ్రామస్థుల కోరిక మేరకు సర్పంచ్ పదవికి పోటీ చేసి విజయం సాధించినట్టు చెప్పారు.
ఆనాడు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించినట్టు చెప్పారు. 24 ఏళ్లకే సర్పంచ్‌గా ఎన్నికైనట్టు చెప్పారు. తిమ్మాజీపేట మండలపరిషత్ ఉపాధ్యక్షుడిగా కూడ కొనసాగినట్టు చెప్పారు. అంచెలంచెలుగా టీడీపీలో ఎదిగినట్టు చెప్పారు.
11 ఏళ్ల పాటు టీడీపీలో పనిచేసినట్టు ఆయన చెప్పారు. 1994 ఎన్నికల్లో జడ్చర్ల నుండి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని టీడీపీ నాయకత్వాన్ని కోరినట్టు చెప్పారు. ఆ సమయంలో పార్టీ తనకు టిక్కెట్టు ఇవ్వలేదన్నారు. కానీ, ఆ సమయంలో పార్టీ సూచించిన అభ్యర్ధి విజయం కోసం తాను పనిచేసినట్టు చెప్పారు.
1999 ఎన్నికల్లో కూడ తాను జడ్చర్ల నుండి టిక్కెట్టు ఇవ్వాలని టీడీపీ నాయకత్వాన్ని కోరితే మరోసారి పార్టీ టిక్కెట్టు తనక దక్కలేదన్నారు. ఈ సమయంలో తాను జడ్చర్ల నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసినట్టు ఆయన గుర్తు చేసుకొన్నారు.కానీ, ఆ ఎన్నికల్లో తాను విజయం సాధించకపోయినా మంచి ఓట్లు సాధించినట్టు ఆయన చెప్పారు.
ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా వ్యాపారంలో ఏడాదిన్నరపాటు బిజీగా గడిపినట్టు చెప్పారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని తనపై ఒత్తిడి వచ్చిందన్నారు. కానీ, ఆ పార్టీలో చేరలేదన్నారు.
కానీ, 2001లో బీజేపీలో చేరినట్టు చెప్పారు. కేవలం ఆరు మాసాలకు పైగా బీజేపీలో పనిచేసినట్టు చెప్పారు. బీజేపీలో చేరిన కొంత కాలానికే కేసీఆర్ టీఆర్ఎస్ ను ఏర్పాటు చేయడంతో తాను టీఆర్ఎస్‌లో చేరినట్టు చెప్పారు.
2004లో జరిగిన ఎన్నికల్లో .జడ్చర్ల అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించినట్టు చెప్పారు. ఆ సమయంలో కాంగ్రెస్ టీఆర్ఎస్‌ల మధ్య పోత్తుందన్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్ ల మధ్య పొత్తుంది. ఈ కారణంగా జడ్చర్ల అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో తాను పోటీకి దూరంగా ఉన్నట్టు చెప్పారు. 2014 ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి జడ్చర్ల నుండి విజంయ సాధించినట్టు చెప్పారు.
తాను వ్యాపారంలో సంపాదించిన దానిలో కొంత మొత్తాన్ని దాన ధర్మాలకు కేటాయిస్తున్నట్టు ఆయన చెప్పారు. 2003లో 10 ఎకరాల భూమిని తాను విరాళంగా ఇచ్చినట్టు చెప్పారు.తాను టీడీపీలో ఉన్న కాలంలో చంద్రబాబునాయుడును నేరుగా కలిసే స్థాయి లేదన్నారు. టీఆర్ఎస్ లో చేరిన సమయంలో తాను నేరుగా కేసీఆర్ ను చాలాసార్లు కలిసినట్టు ఆయన గుర్తు చేశారు.
తనకు మంత్రి జూపల్లి కృష్ణారావుకు మధ్య విబేధాలు లేవన్నారు. జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతిరోజూ తామిద్దరం మాట్లాడుకొంటామని ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.
