హైదరాబాద్: మధులికపై దాడికి పాల్పడిన భరత్‌కు నేర చరిత్ర లేదని ఈస్ట్‌జోన్ డీసీపీ రమేష్ రెడ్డి చెప్పారు.

బుధవారం నాడు ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. భరత్‌ను అరెస్ట్ చేసినట్టు ఆయన చెప్పారు.
ఈ దాడికి పాల్పడిన తర్వాత భరత్ కత్తిని ఇంట్లోనే వదిలి వెళ్లినట్టు ఆయన చెప్పారు.

భరత్ కూడ ఈ దాడి ఘటనతో షాక్‌లో ఉన్నారన్నారు. భరత్‌ను విచారించిన తర్వాత  పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.భరత్‌పై 307 సెక్షన్ కింద హత్యాయత్నంతో పాటు ఫోక్స్ చట్టం కింద కూడ కేసును నమోదు చేశామని ఆయన తెలిపారు.

మధులిక శరీరంపై  పలు చోట్ల గాయాలైనట్టుగా ఆయన చెప్పారు.నెల రోజుల క్రితం భరోసా సెంటర్‌కు రెండు కుటుంబాలు వెళ్లి సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకొన్నారని డీసీపీ చెప్పారు. కానీ, భరత్ ఇవాళ దాడి చేస్తారని భావించలేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

మధులికపై దాడి చేసిన భరత్ అరెస్ట్

మధులిక పరిస్థితి విషమం: 72 గంటలు అబ్జర్వేషన్

హైదరాబాద్‌లో నడిరోడ్డు మీద యువతిపై ప్రేమోన్మాది దాడి