హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓంటరిగా పోటీ చేస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో జనసేనతో ఎలాంటి పొత్తు లేదని ఆయన తేల్చి చెప్పారు.

మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా చాలా మాట్లాడారు ఏమైందని ఆయన ప్రశ్నించారు.

జనసేనతో పాటు ఏ పార్టీతో కూడ పొత్తు లేదని ఆయన స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం తమ పార్టీ ప్రధాన ప్రత్యర్ధి అని ఆయన చెప్పారు. పొత్తుల విషయంలో ఇప్పటివరకు కూడ ఏ పార్టీ తమను సంప్రదించలేదని ఆయన తెలిపారు. 

 

టీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలిచేది ఉంటే ఎంఐఎంతో ఎక్కువ సీట్లు పోటీ చేయిస్తుందని ఆయన చెప్పారు. డిసెంబర్ 1వ తేదీన జీహెచ్ఎంసీ పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 4వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళే విడుదల చేసిన విషయం తెలిసిందే.

దుబ్బాక ఉప ఎన్నికల్లొో విజయంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడ విజయం సాధించాలనే పట్టుదలతో కమలదళం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే పలువురు ఇంచార్జీలను బీజేపీ నియమించిన విషయం తెలిసిందే.