Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యే‌కు కరోనా: హోం క్వారంటైన్‌లోకి ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే ఐదు రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండనున్నారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కవితను కలిసిన ‌జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌‌గా‌ నిర్దారణ కావడంతో, ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

nizamabad trs mlc kavitha going home quarantine
Author
Hyderabad, First Published Oct 13, 2020, 10:40 PM IST

తెలంగాణ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే ఐదు రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండనున్నారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కవితను కలిసిన ‌జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌‌గా‌ నిర్దారణ కావడంతో, ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాదు ఐదు రోజులు పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అందుబాటులో ఉండటం లేదు. బుధవారం మండలి సమావేశం ఉండటంతో ఆమె ఎమ్మెల్సీగా ప్రమాణం చేయాల్సి ఉంది.

కాగా అసెంబ్లీలో కరోనా పరీక్ష చేయించుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇటీవల కరోనా బారినపడ్డ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, కోరుకంటి చందర్‌  బాజిరెడ్డి గోవర్ధన్‌, బిగాల సంతోష్‌ గుప్త, కేపీ వివేకానంద్‌, మంత్రి హరీష్‌రావు, హోంమంత్రి మహమూద్ అలీ తదితరులు కోలుకున్న సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios