నిజామాబాద్ ఉగ్రకుట్రకోణం కేసు: పీఎఫ్ఐ‌కి చెందిన మహమ్మద్ అరెస్ట్

పీఎఫ్ఐకి చెందిన కీలక  సభ్యుడు మహమ్మద్ ను  ఇవాళ పోలీసులు అరెస్ట్  చేశారు. గత కొంతకాలంగా మహమ్మద్ కోసం  పోలీసులు గాలిస్తున్నారు.

Nizamabad Police Arrested PFI Member muhammad lns

నిజామాబాద్: పీఎఫ్ఐకి చెందిన  కీలక సభ్యుడు మహమ్మద్ ను  పోలీసులు  బుధవారంనాడు  అరెస్ట్  చేశారు.  నిజామాబాద్ ఉగ్రకుట్ర  కేసులో  మహమ్మద్  కీలక నిందితుడు. 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  మహమ్మద్  గతంలో నివాసం ఉండేవాడు. అయితే  పీఎఫ్ఐపై నిఘా  పెరగడంతో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కర్ణాటకకు మకాం మార్చాడు. కర్ణాటకలో   తప్పుడు ధృవీకరణ పత్రాలతో  నిందితుడు  మహమ్మద్  నివాసం ఉంటున్నట్టుగా  పోలీసులు గుర్తించారు

  పీఎఫ్ఐ లో  చేరిన వారికి ఆయుధాల  శిక్షకుడిగా  మహమ్మద్  వ్యవహరించాడు. గత కొంతకాలంగా మహమ్మద్  కోసం  పోలీసులు గాలిస్తున్నారు. ఏపీ, తెలంగాణ  రాష్ట్రాల ఇంచార్జీగా మహమ్మద్ వ్యవహరిస్తున్నాడు. పీఎఫ్ఐ సానుభూతిపరులు, ఈ సంస్థతో సంబంధం ఉన్న  14 మందిని తెలంగాణ పోలీసులు  ఇప్పటికే  అరెస్ట్  చేశారు. 

యువతను   ఉగ్రవాదం వైపు  ఆకర్షించి  వారికి  మహమ్మద్ శిక్షణ  ఇస్తున్నారని  పోలీసులు  చెబుతున్నారు.   ఆత్మరక్షణ  కోసం  శిక్షణ  పేరుతో  నిజామాబాద్ లో  ట్రైనింగ్  కార్యక్రమాన్ని పీఎఫ్ఐ  ప్రారంభించింది.  ఈ విషయమై  పోలీసులకు  అందిన సమాచారం  మేరకు  నిఘాను ఏర్పాటు  చేశారు. ఈ శిక్షణ  నిర్వహిస్తున్న ఇంటిపై  పోలీసులు దాడులు  నిర్వహిస్తే  పీఎఫ్ఐ  అంశం వెలుగు చూసింది.  నిజామాబాద్ తో పాటు   తెలంగాణ, ఏపీ రాష్ట్రంలోని  పలు జిల్లాల్లో  కూడ  పోలీసులు సోదాలు  నిర్వహించారు. 

ఈ ఘటన తర్వాత  దేశ వ్యాప్తంగా  కూడ  పలు రాష్ట్రాల్లో పీఎఫ్ఐ  సంస్థ కార్యాలయాలపై  సోదాలు  నిర్వహించారు. పీఎఫ్ఐ కార్యాలయాల్లో సోదాలను ఎన్ఐఏ నిర్వహించింది.  నిజామాబాద్ లో   కూడ  ఎన్ఐఏ  అధికారులు  సోదాలు  నిర్వహించారు. స్థానిక పోలీసుల నుండి సమాచారం సేకరించిన విషయం తెలిసిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios