Asianet News TeluguAsianet News Telugu

ఉత్తమ ఎంపిగా కవిత...పది విభాగాలపై సర్వే

సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపి కవిత ఉత్తమ పార్లమెంటీరియన్ అవార్డుకు ఎంపికయ్యారు.దేశవ్యాప్తంగా ఎంపీల పనితీరు, ప్రజల్లో ఆదరణ వంటి తదితర 10 అంశాలపై ఫేమ్ ఇండియా-ఏసియా పోస్ట్ మేగజైన్ అనే సంస్థ శ్రేష్ణ్ సంసద్ పేరుతో ఓ సర్వే నిర్వహించింది. ఇందులో వివిధ విభాగాలపై వచ్చిన సర్వే ఫలితాల ఆధారంగా అత్యుత్తమ ఎంపీలను ఎంపికచేశారు. 

nizamabad mp selected chosen for Best Parliamentarian Award
Author
Nizamabad, First Published Jan 21, 2019, 8:46 PM IST

సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపి కవిత ఉత్తమ పార్లమెంటీరియన్ అవార్డుకు ఎంపికయ్యారు.దేశవ్యాప్తంగా ఎంపీల పనితీరు, ప్రజల్లో ఆదరణ వంటి తదితర 10 అంశాలపై ఫేమ్ ఇండియా-ఏసియా పోస్ట్ మేగజైన్ అనే సంస్థ శ్రేష్ణ్ సంసద్ పేరుతో ఓ సర్వే నిర్వహించింది. ఇందులో వివిధ విభాగాలపై వచ్చిన సర్వే ఫలితాల ఆధారంగా అత్యుత్తమ ఎంపీలను ఎంపికచేశారు. 

nizamabad mp selected chosen for Best Parliamentarian Award

ఈ సర్వేలో నిజామాబాద్ ఎంపి కవిత దేశంలోని సీనియర్ ఎంపీలను వెనక్కినెట్టి ఉత్తమ పార్లమెంటీయన్ అవార్డుకు ఎంపికయ్యారు. రానున్న భవిష్యత్ కాలంలో అత్యంత ప్రభావితం చేయగల ఎంపిగా ఆమెను ఇండియా-ఏసియా పోస్ట్ మేగజైన్ అభివర్ణించింది. 

ఈ నెల 31న ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరుగనున్న కార్యక్రమంలో ఎంపీ కవిత ఈ అవార్డును అందుకోనున్నారు.ఈమెతో పాటు మరికొంత మంది ఎంపీలు కూడా ఉత్తమ  పార్లమెంటీరియన్ అవార్డులు అందురకోనున్నారు. 

పార్లమెంట్ లో లేవనెత్తిన ప్రశ్నలు, వివిధ అంశాలపై జరిగే చర్యల్లో భాగస్వామ్యం, పార్లమెంట్ హాజరు, ప్రజల్లో వుండే ఆదరణ, సమాజ సేవలో భాగస్వామ్యం, రాజకీయాల్లో ప్రభావం ఇలా పది అంశాలపై సర్వే నిర్వహించి ఉత్తమ ఎంపీలను ఎంపికచేశారు. హాజరు విషయం ఒక్కటి మినహాయిస్తే అన్ని విభాగాల్లోనూ కవితకు 90శాతం కంటే మెరుగైన స్థానంలో వున్నారు. దీంతో ఆమె ఉత్తమ పార్లమెటేరియన్ గా ఎంపికయ్యారు.   
 
Follow Us:
Download App:
  • android
  • ios