Asianet News TeluguAsianet News Telugu

గల్ఫ్ మోసాలపై నిఘా... ఏజెంట్లపై కఠిన చర్యలు: కవిత హెచ్చరికలు

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం టీఆర్ఎస్ కోసం పనిచేసేవారే గెలిచారన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కవిత ఓటు వేశారు. తమ స్వగ్రామం నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం పోతంగల్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

nizamabad mp kavitha warning to gulf agents
Author
Nizamabad, First Published Jan 30, 2019, 11:13 AM IST

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం టీఆర్ఎస్ కోసం పనిచేసేవారే గెలిచారన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కవిత ఓటు వేశారు. తమ స్వగ్రామం నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం పోతంగల్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చారు. తెలంగాణ గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసి.. అభివృద్ధి చేయడం సీఎం కేసీఆర్ కల అని ఆమె తెలిపారు.

కొత్తగా సర్పంచ్, వార్డ్ సభ్యులుగా గెలిచిన వారు గ్రామ అభివృద్ధికి పాటుపడాలని కవిత పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్, బీజేపీలు దొందూ దొందేనని, ప్రజలకు ఆ రెండు పార్టీలు చేసేందేమీ లేదన్నారు. గల్ఫ్ మోసాలు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని, నకిలీ ఏజెంట్లపై ఇక నుంచి కఠిన చర్యలు తీసుకుంటామని కవిత హెచ్చరించారు. కేంద్రం నకిలీ ఏజెంట్లపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని కవిత డిమాండ్ చేశారు. 

ఫలించిన కవిత కృషి: హైదరాబాద్‌ చేరుకున్న 14 మంది గల్ఫ్ బాధితులు

Follow Us:
Download App:
  • android
  • ios