తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కవిత ప్రజలతో మమేకం  అయ్యేందుకు టెక్నాలజీని వాడుకుంటున్నారు. ఇప్పటికే ఆమె సోదరుడు, టీఆర్ఎస్ వర్కంగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెక్నాలజీ, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రజలకు ఎంతో దగ్గరయ్యారు. ఆయన బాటలోనే ప్రజలకు దగ్గరవతూ, వారి సమస్యల గురించిం తెలుసుకునేందుకు కవిత ట్విట్టర్ ను ఆశ్రయించారు. 

ఈ నెల 30వ  తేదీన ఒంటి గంటకు ట్విట్టర్ ద్వారా ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడనున్నట్లు...అందుకోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు కవిత వెల్లడించారు. తెలంగాణ ప్రజలతో తన అభిప్రాయాలను పంచుకోనున్నట్లు తెలిపారు.

అలాగే ''ఆస్క్ ఎంపీ కవిత'' (#AskMPKavitha) హ్యాష్ ట్యాగ్ తో ప్రజలు తమ సమస్యలు, సందేహాలపై ప్రశ్నలను పంపించవచ్చని...వాటికి ట్విట్టర్ లైవ్ లో సమాధానం  చెప్పనున్నట్లు కవిత వెల్లడించారు. ఇలా ట్విట్టర్ లైవ్ గురించి కవిత తన అధికారికి ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.