నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కుమారుడు ఆర్య(11) అస్వస్థతకు గురయ్యాడు. దీంతో... ఆర్యను రెయిన్ బో ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. కాగా... .ఆర్యను చూసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం మధ్యాహ్నం ఆస్పత్రికి వచ్చారు. 

మనుమడిని పలకరించి, ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పది నిమిషాల పాటు మనవడి వద్ద ఉండి వెళ్లిపోయారు. జ్వరంతో బుధవారం ఆస్పత్రిలో చేరిన ఆర్య ఆరోగ్యం కుదుట పడిందని, శనివారం డిశ్చార్జి చేసే అవకాశాలున్నాయని ఆస్పతి వర్గాలు తెలిపాయి.