హైదరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి తనయురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఘన విజయాన్ని సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థికి భరిలోకి దిగిన ఆమె ప్రత్యర్థులను మట్టికరిపించి అద్భుత విజయాన్ని అందుకున్నారు. 

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఇటీవలే పోలింగ్ ముగియగా ఇవాళ(సోమవారం) ఫలితం వెలువడింది. ఇదివరకే పోలింగ్ ద్వారా బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిక్తమైన అభ్యర్ధులు భవితవ్యం సోమవారం తేలిపోయింది. ఈ ఫలితం కోసం అభ్యర్థులే కాదు నిజామాబాద్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూడగా తాజాగా టీఆర్ఎస్ కు అనుకూలంగా ఫలితం వెలువడింది.

ఓట్ల లెక్కింపు ప్రక్రియ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో జరిగింది. లెక్కింపు కోసం ఆరు టేబుళ్ల ద్వారా జరగ్గా... కేవలం రెండు రౌండ్లలో ఫలితం తేలింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ ఎంపీ క‌విత‌, కాంగ్రెస్ నుంచి వ‌డ్డేప‌ల్లి సుభాష్‌రెడ్డి, బీజేపీ అభ్య‌ర్థిగా ల‌క్ష్మీనారాయణ పోటీచేశారు. 

 రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు వివరాలు: 

 మొత్తం ఓట్లు 824

పోలయిన ఓట్లు 823

టిఆర్ఎస్ 728

బీజేపీ 56

కాంగ్రెస్ 29

చెల్లని ఓట్లు 10